షాకింగ్: మరో యంగ్ హీరో బీస్ట్ అవతార్
ఇప్పుడు ఇదే జాబితాలో మరో హీరో చేరాడు. అతడు నిఖిల్ సిద్ధార్థ్. ఏ ఇతర హీరోతో పోల్చినా సెలక్టివ్ స్క్రిప్టులతో యూనిక్ నెస్ తో ఆకట్టుకుంటున్న మేటి హీరోగా నిఖిల్ మెప్పిస్తున్నాడు.
మ్యాకో మ్యాన్ లుక్ కి ట్రాన్స్ ఫామ్ అవ్వడం అంటే అంత ఈజీ కాదు. కఠోరమైన శిక్షణ అవసరం. కఠిన ఆహార నియమాల్ని పాటించాలి. వీటన్నిటికీ మించి సమయపాలన, నోరు కట్టేసుకుని పద్ధతి ప్రకారం తిండి పదార్థాల్ని ఎంపిక చేసుకుని తినాలి. అయితే మన హీరోలు సినిమా కోసం ఏం చేయడానికైనా రెడీ. కఠినమైన ఆహార నియమాలు పాటిస్తూనే నిరంతరం జిమ్ చేస్తూ స్టార్లు చాలా శ్రమిస్తున్నారు. గొప్ప క్రమశిక్షణతో అనుకున్నది సాధించుకుంటున్నారు.
ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, దగ్గుబాటి రానా వీళ్లంతా బీస్ట్ అవతార్ లతో మెప్పించారు. యువహీరోల్లో నితిన్, అఖిల్, నాగశౌర్య, ప్రిన్స్, నవదీప్ ఇప్పటికే భీకరమైన లుక్ కి మారి ఆశ్చర్యపరిచారు. ఇప్పుడు ఇదే జాబితాలో మరో హీరో చేరాడు. అతడు నిఖిల్ సిద్ధార్థ్. ఏ ఇతర హీరోతో పోల్చినా సెలక్టివ్ స్క్రిప్టులతో యూనిక్ నెస్ తో ఆకట్టుకుంటున్న మేటి హీరోగా నిఖిల్ మెప్పిస్తున్నాడు. కెరీర్ పరంగా గ్రిప్ పెంచుకుని ముందుకు సాగుతున్న నిఖిల్ 'కార్తికేయ 2' రూపంలో పాన్ ఇండియా హిట్ కూడా అందుకున్నాడు. ఇప్పుడు నిఖిల్ కి ఇటు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, అటు ఉత్తరాదినా భారీ ఫాలోయింగ్ ఏర్పడింది. దానికి తగ్గట్టే ఇటీవల అతడి ఎంపికలు కూడా మరింతగా మారిపోయాయి.
నెక్ట్స్ లెవల్ కి చేరాల్సిన టైమ్ ఇది. అందుకే ఇప్పుడు భారీతనం నిండిన యాక్షన్ సినిమాలో నటిస్తున్నాడు. ఇది వారియర్ కథాంశం నేపథ్యంలో రక్తి కట్టించబోతోంది. స్వయంభు అంటూ ఇప్పటికే మోస్ట్ పవర్ ఫుల్ టైటిల్ ని లాక్ చేసాడు. ఇటీవల షూట్ బిగిన్స్ అని కూడా ప్రకటించేసారు. ఇప్పటికే నిఖిల్ ఎంపిక చేసుకున్న పాత్రకు తగ్గట్టుగా తన రూపాన్ని కూడా మార్చుకున్నాడు. తాజాగా అతడి మ్యాకో రూపం రివీలైంది. ఇన్ స్టాలో నిఖిల్ షేర్ చేసిన ఈ ఫోటోగ్రాఫ్ ని బట్టి అతడు ఈ కొత్త లుక్ కోసం ఎంతగా శ్రమించి ఉంటాడో అర్థం చేసుకోవచ్చు. అతడి ఫిజిక్ చాలా మారింది. బీస్ట్ అవతార్ కి మారాడు. మరింతగా అతడి రూపం ఇకపైనా మారుతుందనడంలో సందేహం లేదు.