అనుకోకుండా బాధ‌పెడితే సారీ: శ్రీ‌లీల‌

మీరు ఎప్పుడైనా ఎవరినైనా ఉద్దేశపూర్వకంగా లేదా అనుకోకుండా బాధపెట్టినట్లయితే…సారీ చెప్పేయ‌మ‌ని సూచించింది.

Update: 2025-01-01 04:03 GMT

అవును.. శ్రీ‌లీల సారీ చెప్పింది. ఒక‌వేళ ఎవ‌రినైనా అనుకోకుండా బాధ‌పెట్టినా, కావాల‌ని ఉద్దేశ‌పూర్వ‌కంగా బాధ పెట్టినా క్ష‌మించ‌మ‌ని అడిగే స‌మ‌య‌మిది అని అంటోంది. నిజ‌మే..! `కిస్సిక్..` గాళ్ ఒకే ఒక్క పాట‌తో యువ‌త‌రం గుండెల్లో ముల్లు గుచ్చింది. మ‌న‌సుకు గాయం చేసింది. ఈ బాధ కొత్త సంవ‌త్స‌రంలోను అలానే ఉంటుంది. అందుకే తెలివిగా ఇలా ముందే సారీ చెప్పేసింది మ‌రి.


2024 ఎంత మంచి సంవ‌త్స‌ర‌మో గుర్తు చేసుకుంటూ 2025 కి వెల్ కం చెప్పేసింది. శ్రీ‌లీల త‌న అభిమానుల కోసం ఇన్‌స్టాలో షేర్ చేసిన విషెస్ సారాంశం ఇలా ఉంది.

ఇది ఎంత మంచి సంవత్సరం!! అంటూ త‌న ఆనందం వ్య‌క్తం చేసిన శ్రీ‌లీల‌.. క్షమించ‌మ‌ని చెప్పే సమయమిద‌ని..

మీరు ఎప్పుడైనా ఎవరినైనా ఉద్దేశపూర్వకంగా లేదా అనుకోకుండా బాధపెట్టినట్లయితే…సారీ చెప్పేయ‌మ‌ని సూచించింది. 2024లో పుష్ప 2 లో స్పెష‌ల్ సాంగ్ శ్రీ‌లీల‌కు జాతీయ స్థాయిలో ఇమేజ్ పెంచింద‌న‌డంలో సందేహం లేదు. ఈ ఉత్సాహంలో... క‌వితాత్మ‌కంగా శ్రీ‌లీల చెప్పిన విష‌యం ఇలా ఉంది:

ప్రజల కృషిని గుర్తించే సమయం..

ఆ క్షణం మరిచిపోతే..

విశ్వానికి కృతజ్ఞతతో ఉండాల్సిన సమయం

ప్రతిదానికీ! దయగా ఉండాల్సిన సమయం ,

వైజర్ కూడా స్నానం చేసిన తర్వాత గీజర్‌ని స్విచ్ చేయండి..

వీటన్నింటిని కూడా మన దైనందిన దినచర్యలో భాగంగా చేసుకోవడానికి ..

రాబోయే అందమైన సంవత్సరంలో

ప్రజలకు మంచి సంస్కరణను అందించడానికి నిజాయితీగా ఉండాల్సిన సమయం ..

నేను నిన్ను ప్రేమిస్తున్నాను..

దేవుడు నాకు పేరు ఇచ్చినందుకు ధన్యవాదాలు ప్రేమ‌..

ఎప్పుడూ దేన్నీ పెద్దగా తీసుకోలేదు

ఎన్నటికీ కాదు

ధన్యవాదాలు 2024💝

స్వాగతం 2025💖

లవ్ యూ యార్.. అంటూ ల‌వ్ ఈమోజీల‌ను షేర్ చేసింది.

Tags:    

Similar News