అక్షర హాసన్‌ ఇంత సంపాదిస్తోందా?

యూనివర్శిల్ స్టార్‌ కమల్‌ హాసన్‌ ఇద్దరు కుమార్తెలు శృతి హాసన్ మరియు అక్షర హాసన్ లు ఇప్పటికే ఇండస్ట్రీలో అడుగు పెట్టారు.

Update: 2023-11-03 07:09 GMT

యూనివర్శిల్ స్టార్‌ కమల్‌ హాసన్‌ ఇద్దరు కుమార్తెలు శృతి హాసన్ మరియు అక్షర హాసన్ లు ఇప్పటికే ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. శృతి హాసన్ పాన్‌ ఇండియా స్టార్‌ హీరోయిన్‌ గా వరుస సినిమాల్లో నటిస్తోంది. హిందీ, తమిళ, తెలుగు సినిమాల్లో నటించడంతో పాటు హిందీ వెబ్‌ సిరీస్ ల్లో నటించి నటిగా మెప్పించడంతో పాటు తన అందాల ఆరబోతతో మెప్పించింది.

కోట్లాది రూపాయల పారితోషికం తీసుకుంటూ శృతి హాసన్ బాగానే డబ్బు వెనకేసుకుని ఉంటుంది. కానీ అక్షర హాసన్ మాత్రం ఇప్పటి వరకు కమర్షియల్‌ గా సక్సెస్ లను సొంతం చేసుకోలేక పోయింది. వచ్చిన ఆఫర్లు కూడా ఆమెకు పెద్దగా విజయాలను కట్టబెట్టడం లేదు. దాంతో అక్షర హాసన్‌ పారితోషికం విషయం లో చాలా వెనుకబడి ఉంటుంది.

పెద్దగా క్రేజ్ లేని అక్షర హాసన్‌ తాజాగా ముంబైలో ఏకంగా రూ.15.75 కోట్ల తో ఖరీదైన లగ్జరీ అపార్ట్‌మెంట్‌ ను కొనుగోలు చేసింది. ఇందుకు గాను రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో దాదాపుగా కోటి రూపాయల స్టాంప్ డ్యూటీ ని చెల్లించింది. సదరు ప్లాట్ లో ఇంటీరియర్ ఇతర ఏర్పాట్లతో కలిపి మొత్తంగా 20 కోట్ల రూపాయల వరకు అక్షర హాసన్‌ ఖర్చు చేసిందని టాక్‌ వినిపిస్తోంది.

సినిమాలు చేతిలో లేని అక్షర హాసన్ కు ఇన్ని కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. వారికి తెలియని విషయం ఏంటి అంటే అక్షర హాసన్‌ యూనివర్శల్ స్టార్ కమల్‌ హాసన్ కూతురు. ఆయన ఆస్తుల గురించి, సంపాదన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటి తండ్రికి కూతురు అయిన అక్షర 20 కోట్లతో అపార్ట్‌మెంట్‌ లో ఫ్లాట్‌ కొనుగోలు చేయడం లో ఆశ్చర్యం ఏముందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

ఇక ఏక్తా టవర్ వెర్వ్‌ లోని 13వ అంతస్తులో అక్షర హాసన్ కొనుగోలు చేసిన ప్లాట్‌ యొక్క ప్రత్యేకతల విషయానికి వస్తే అద్భుతమైన వ్యూ ఉండే విధంగా బాల్కనీ ఉంటుందట. అంతే కాకుండా మూడు కార్ల పార్కింగ్‌ ను కూడా కలిగి ఉంటుంది. 13వ అంతస్తులో అవ్వడం వల్ల ప్రత్యేకమైన లిఫ్ట్‌ సౌకర్యం ను కూడా ఏర్పాటు చేయడం జరిగిందట. మొత్తానికి అత్యంత విలాసవంతంగా, అద్భుతంగా అక్షర కొత్త ఫ్లాట్ ఉంటుందని అంటున్నారు

Tags:    

Similar News