పాపిట బొట్టు... మెళ్లో తాళి.. ప్రెస్ మీట్ లో హీరోయిన్ షాక్..!
తమిళ్ లో ఒక మోస్తారు ఇమేజ్ తెచ్చుకున్న అమ్మడు తెలుగులో పెద్దగా క్లిక్ అవ్వలేదు. అసలు ఐశ్వర్య ప్రతిభకు తగిన పాత్ర పడలేదని చెప్పొచ్చు
సహజ నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఐశ్వర్య మీనన్ తను ఎంచుకున్న పాత్రల వల్లనో లేక తన ఆన్ స్క్రీన్ లుక్స్ వల్లనో తెలియదు కానీ ఆమెకు కేవలం హోమ్లీ పాత్రలే వస్తున్నాయి. తనకు గ్లామర్ గా నటించాలని ఉన్నా కూడా తనకు అలాంటి పాత్రలు రావట్లేదని అని చెబుతూ వస్తుంది ఐశ్వర్య రాజేష్. తమిళ్ లో ఒక మోస్తారు ఇమేజ్ తెచ్చుకున్న అమ్మడు తెలుగులో పెద్దగా క్లిక్ అవ్వలేదు. అసలు ఐశ్వర్య ప్రతిభకు తగిన పాత్ర పడలేదని చెప్పొచ్చు.
కౌసల్య కృష్ణమూర్తి, వరల్డ్ ఫేమస్ లవర్, టక్ జగదీష్ ఇలా తను చేసిన సినిమాలతో ఎంతో పేరొస్తుందని భావించిన ఐశ్వర్యకు నిరాశ తప్పలేదు. అయినా సరే తెలుగులో తనకు ఎలాంటి ఛాన్స్ వచ్చినా కాదనకుండా చేస్తుంది అమ్మడు. లేటెస్ట్ గా విక్టరీ వెంకటేష్ తో సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో నటిస్తుంది ఐశ్వర్య రాజేష్. సూపర్ హిట్ డైరెక్టర్ అనీల్ రావిపుడి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా పొంగల్ రిలీజ్ కు రెడీ అవుతుంది.
రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ చిత్ర యూనిట్ లేటెస్ట్ గా ప్రెస్ మీట్ ఎరేంజ్ చేశారు. ఐతే ఈ ప్రెస్ మీట్ లో నటించిన లీడ్ యాక్టర్స్ అంతా కూడా సినిమాలో వారి పాత్రల కట్టు బొట్టుతో కనిపించారు. వెంకటేష్ పంచెతో.. ఐశ్వర్య రాజేష్ మెడలో తాళి, పాపిట బొట్టుతో.. మీనాక్షి చౌదరి పోలీస్ డ్రస్ తో కనిపించారు. ఐతే అందరు ఏమో కానీ మెడలో తాళి.. పాపిట బొట్టుతో ఐశ్వర్య రాజేష్ నిజంగానే ఆమెకు పెళ్లైంది అనిపించేలా సర్ ప్రైజ్ ఇచ్చింది.
వెంకటేష్, మీనాక్షి పాత్రల కోసమే అన్నట్టుగా అనిపిస్తుండగా ఐశ్వర్య రాజేష్ మాత్రం తన న్యాచురల్ లుక్స్ తో ఆకట్టుకుంది. సినిమాలో ఆమె వెంకీ వైఫ్ గా నటించింది. అందుకే సినిమా ప్రెస్ మీట్ లో అలా కనిపించింది. చూస్తుంటే సినిమాలో అనీల్ రాసుకున్న పాత్రలకు పర్ఫెక్ట్ కాస్టింగ్ దొరికినట్టు అనిపిస్తుంది. అనీల్ సినిమాలో హీరోయిన్ గా చేస్తే సూపర్ హిట్ గ్యారెంటీ అన్నట్టే. మరి తెలుగులో ఒక మంచి హిట్ కోసం చూస్తున్న ఐశ్వర్యకు సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఆ సక్సెస్ ఇస్తుందా లేదా అన్నది చూడాలి. సంక్రాంతి రేసులో మరో రెండు భారీ సినిమాలు ఉన్నా పొంగల్ కి ఫ్యామిలీ అంతా కలిసి చూసే సినిమాగా సంక్రాంతికి వస్తున్నాం రిలీజ్ లాక్ చేశారు. మరి ఈ సినిమాపై దర్శక నిర్మాతలు పెట్టుకున్న నమ్మకం నిజమవుతుందా లేదా అన్నది సంక్రాంతికి తెలుస్తుంది.