గుస‌గుస‌.. మెంట‌ల్ హీరోయిన్‌తో స‌హ‌న‌టుల క‌ష్టాలు!

బాలీవుడ్ నటి అలియా భట్ తాజా ఇంట‌ర్వ్యూలో చెప్పిన ఒక విష‌యం నిజంగా షాక్ కి గురి చేసింది.

Update: 2024-09-22 12:30 GMT

ఆర్.ఆర్.ఆర్ లో రామ్ చ‌ర‌ణ్ స‌ర‌స‌న న‌టించింది ఆలియా భ‌ట్. అల్లూరి సీతారామ‌రాజు భార్య‌ సీత‌గా న‌టించి మెప్పించింది. చిన్న పాత్ర‌లోనే అయినా.. స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనే ఒక వీరుడి క‌థ‌లో ధైర్య‌మైన యువ‌తిగా న‌టించి హృద‌యాల‌ను గెలుచుకుంది. రాజీ, గంగూభాయి క‌తియావాడీ లాంటి చిత్రాల్లో విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌ల‌తో చెర‌గ‌ని ముద్ర వేసిన ఆలియా వ్యక్తిగ‌త జీవితం ఎంత స‌మ‌స్యాత్మ‌క‌మైన‌దో ఊహించ‌గ‌ల‌రా?

బాలీవుడ్ నటి అలియా భట్ తాజా ఇంట‌ర్వ్యూలో చెప్పిన ఒక విష‌యం నిజంగా షాక్ కి గురి చేసింది. తాను మానసిక రుగ్మతతో బాధపడుతున్నానని, ఎక్కువ స‌మ‌యం దేనిపైనా దృష్టి పెట్టలేనని చెప్పింది. తనకు చాలా కాలం పాటు టాస్క్‌లపై దృష్టి పెట్టడం కష్టంగా మారే పరిస్థితి ఉందని వెల్లడించింది. తనకు అటెన్షన్ డెఫిసిట్ హైపర్యాక్టివిటీ డిజార్డర్ (ADHD) ఉందని, అందుకే మేకప్ సెట్‌లో 45 నిమిషాల కంటే ఎక్కువ సమయం వెచ్చించలేనని, దేనిని అయినా సింపుల్ గా ముగించే విధానాన్ని ఇష్టపడ‌తాన‌ని తెలిపింది. ఈ పరిస్థితి కారణంగా ఆలియా తన పనిలో తొందరపాటుతో ఉంటాన‌ని.. నాతో క‌లిసి ప‌ని చేసేవారు కూడా త్వ‌ర‌గా ప‌ని పూర్త‌య్యేట్టు త‌న‌తో ఉండాల్సిన ప‌రిస్థితి ఉంద‌ని వెల్ల‌డించి షాకిచ్చింది.

ADHD అనేది మానసిక రుగ్మత. ఓ ప‌ట్టాన దేనిపైనా శ్ర‌ద్ధ ఉండ‌దు. ఒక‌దాని వెంట ఒక‌టిగా ప‌నుల‌ను చ‌క్క‌బెట్ట‌లేరు. శ్రద్ధను రోజంతా ఒకేలా కొనసాగించడంలో ఇబ్బందులు.. పరిణామాలను పరిగణనలోకి తీసుకోకుండా పనులు చేసే ధోరణి ఉంటుందిట‌.

త‌దుప‌రి తీరిక లేని షెడ్యూళ్ల‌తో చుక్క‌లే:

అయితే ఆలియా ఆరోగ్య ప‌రిస్థితి ఇలా ఉన్నా కానీ, అందుకు విరుద్ధంగా క్ష‌ణం తీరిక లేని షెడ్యూళ్ల‌తో పోరాడాల్సిన స్థితి ఉంది. ఆలియా బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో న‌టించాల్సి ఉంది. ఇప్ప‌టికే పూర్తి చేసిన 'జిగ్రా' అక్టోబర్ 11న విడుదలకు సిద్ధంగా ఉంది. దీంతో పాటు వై.ఆర్.ఎఫ్‌లో స్పై థ్రిల్లర్ ఆల్ఫా చిత్రీక‌ర‌ణ‌లో ఉంది. త‌దుప‌రి భ‌న్సాలీ ద‌ర్శ‌క‌త్వంలో 'లవ్ అండ్ వార్'లో న‌టిస్తుంది.

ఆ తర్వాత ఒక నిజ‌మైన‌ రొమాంటిక్ ల‌వ్ స్టోరీని నిర్మించడానికి, అలాగే నటించడానికి అలియా భట్ సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రేమ‌క‌థా చిత్రంపై క‌సిగా ఉంద‌ట‌. ఇందులో ర‌ణ‌బీర్ స‌ర‌స‌న ఆలియా న‌టించేందుకు ఆస్కారం ఉంద‌ని చెబుతున్నారు. ర‌ణబీర్ తో కుద‌ర‌క‌పోతే వరుణ్ ధావన్‌తో ప‌ని చేసే వీలుంద‌ట‌. కానీ ఇప్ప‌టివ‌ర‌కూ ఈ కొత్త ప్రాజెక్టుపై అధికారికంగా ఎలాంటి స‌మాచారం లేదు. త‌న‌కు మెంట‌ల్ ఉంద‌ని ఒప్పుకున్న ఒక న‌టి ఇంత పెద్ద లైన‌ప్ తో ముందుకు వెళ్ల‌డం అంటే నిజంగా సాహ‌స‌మే.

Tags:    

Similar News