గుసగుస: చివరికి నటితో రాయ'బేరాని'కి దిగారట!
కెరీర్ కోసం ఎంతగానో పాకులాడి, సుదీర్ఘ కాలం ఎన్నిటినో ఎదుర్కొన్న తర్వాత కానీ నటీమణులు పరిశ్రమలో ఒక హోదాను, డిగ్నిటీని అందుకోవడం సాధ్యపడదనేది ఒక గుసగుస
By: Tupaki Desk | 20 Sep 2024 7:00 AM GMTకెరీర్ కోసం ఎంతగానో పాకులాడి, సుదీర్ఘ కాలం ఎన్నిటినో ఎదుర్కొన్న తర్వాత కానీ నటీమణులు పరిశ్రమలో ఒక హోదాను, డిగ్నిటీని అందుకోవడం సాధ్యపడదనేది ఒక గుసగుస. రంగుల ప్రపంచంలో మాయలు మర్మాల గురించి.. వేధింపుల గురించి నిరంతరం కథలెన్నో ఉన్నాయి. ఇలాంటి పెద్ద సమస్య ఉంది గనుకనే ఇంతకుముందు మీటూ వేవ్ ఊపేసింది. ఇప్పుడు హేమ కమిటీ వేవ్.. అనంతరం మీటూ సెకండ్ వేవ్ దక్షిణాది సినీపరిశ్రమల్ని ఊపేస్తున్నాయి. ప్రతిసారీ తమకు జరిగిన అన్యాయాలను చెప్పుకుంటూ నటీమణులు మీడియా ముందుకు వస్తున్నారు.. వాపోతున్నారు.
జస్టిస్ హేమ కమిటీ మాలీవుడ్ ని అట్టుడికిస్తున్న ఇలాంటి సమయంలో టాలీవుడ్ కోలీవుడ్ శాండల్వుడ్ లోను దీని ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. పరిశ్రమల్లోని మహిళా కమిటీలన్నీ ఫుల్ గా యాక్టివ్ అయిపోయి దడ పుట్టిస్తున్నాయి. వేధింపుల మాన్ స్టార్ల గుండెల్లో గుబులు రేకెత్తిస్తున్నాయి. ఇటీవల ప్రముఖ తెలుగు దర్శకుడిపై నటి ఆరోపణలు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. మూవీ ఆర్టిస్టుల సంఘం ఆనాడే పరిష్కరించి ఉంటే ఇలా జరిగి ఉండేది కాదు! అంటూ సోషల్ మీడియాల్లో సదరు నటి ఆవేదన వ్యక్తం చేసింది. అది అలా ఉండగానే, ఇప్పుడు దర్శకుడిపై ఆరోపించిన నటిని బుజ్జగించేందుకు ప్రయత్నాలు సాగుతున్నట్టు గుసగుస వినిపిస్తోంది. ఒక మధ్యవర్తి ద్వారా భరోసా లభించినట్టు గుసగుస వినిపిస్తోంది. టాలీవుడ్‌లోని ఒక ప్రముఖ వ్యక్తి సదరు నటికి దగ్గర వాళ్లను సంప్రదించి ఆఫర్ ఇచ్చారట. పెద్ద దర్శకుడిపై ఆమె ఇటీవల సోషల్ మీడియా పోస్ట్‌లో చేసిన ఆరోపణలను ఇకపై ఆపేస్తే న్యాయం అందిస్తానని ఆఫర్ ఇచ్చారనేది గుసగుస.
పరిశ్రమ ప్రతిష్టను దెబ్బతీయవద్దని, మంచి వాతావరణాన్ని పాడుచేయవద్దు అని మధ్యవర్తుల ద్వారా సదరు నటీమణికి మొర పెట్టుకున్నారట. అంతేకాదు తన కెరీర్ ని నష్టపోయానని ఆవేదన చెందిన సదరు నటీమణికి నష్టపరిహారాన్ని అందించేందుకు ప్రయత్నిస్తున్నారట. గతంలో కోల్పోయినా కానీ, ఇప్పుడు అవకాశాల రూపంలో పరిహారం ఉంటుందని సెలవిచ్చారట. మొత్తానికి వివాదానికి పరిష్కారం కోసం పెద్ద దర్శకుడు తనవంతు ప్రయత్నాలు చేస్తున్నట్టు ఇన్ సైడ్ టాక్. అయితే ఇక్కడ గొడవ ముఖ్యమా? లేదూ తనకు అవకాశాలు కావాలా? అంతిమంగా ఎలాంటి పరిష్కారం కావాలి? అన్నది సదరు నటీమణి డిసైడ్ చేయాల్సి ఉంటుంది.