ఇండస్ట్రీ అబ్బాయి అస్సలు వద్దు బాబోయ్‌!

బచ్చలమల్లి సినిమా ప్రమోషన్‌లో భాగంగా అమృత అయ్యర్‌ ఒక ఇంటర్వ్యూలో పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అనే ప్రశ్నకు సమాధానంగా... వచ్చే సంవత్సరం ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను.

Update: 2024-12-17 02:30 GMT

తమిళ్ సినిమాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా నటిస్తూ తెలుగులో '30 రోజుల్లో ప్రేమించడం ఎలా' సినిమాతో హీరోయిన్‌గా మంచి గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మ అమృత అయ్యర్‌. రామ్ సినిమా 'రెడ్‌'లోనూ కీలక పాత్రలో నటించినా ఆ పాత్ర పెద్దగా గుర్తింపు తెచ్చి పెట్టలేదు. తెలుగులో ఈమె చేసిన సినిమాలు పెద్దగా హిట్‌ కాకపోవడంతో ఆఫర్లు తక్కువగా వచ్చాయి. తేజ సజ్జా హీరోగా ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో వచ్చిన హనుమాన్‌ సినిమాలో ఈ అమ్మడు హీరోయిన్‌గా నటించింది. 2024 సంక్రాంతికి వచ్చిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.

హనుమాన్‌ సినిమా తర్వాత ఒక్కసారిగా టాలీవుడ్‌లో ఈ అమ్మడు బిజీ అయ్యింది. ఆచితూచి సినిమాలు ఎంపిక చేసుకుంటూ కెరీర్‌లో ముందుకు సాగుతున్న ఈ అమ్మడు త్వరలో అల్లరి నరేష్‌తో కలిసి బచ్చలమల్లి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ సినిమాలో తన పాత్ర తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందని, సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుంది అంటూ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆమె పేర్కొంది. ఆకట్టుకునే అందంతో పాటు నటనలో మంచి ప్రతిభ ఉన్న అమృత తాజాగా ఒక ఇంటర్వ్యూలో పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చింది.

బచ్చలమల్లి సినిమా ప్రమోషన్‌లో భాగంగా అమృత అయ్యర్‌ ఒక ఇంటర్వ్యూలో పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అనే ప్రశ్నకు సమాధానంగా... వచ్చే సంవత్సరం ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను. అయితే ఇండస్ట్రీకి చెందిన అబ్బాయిని పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం తనకు లేదు అంది. సినిమా ఇండస్ట్రీకి చెందిన అబ్బాయిని పెళ్లి చేసుకోవడం వల్ల ఇద్దరిదీ ఒకే ఇండస్ట్రీ కావడంతో ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. అందుకే నేను ఇండస్ట్రీకి చెందిన అబ్బాయిని పెళ్లి చేసుకోవద్దు అని మొదటి నుంచి అనుకుంటున్నాను. ఇంట్లో వారికి అదే విషయాన్ని చెప్పాను అంది.

సినిమా ఇండస్ట్రీకి చెందిన అబ్బాయినే చేసుకుంటే మాట్లాడుకోవడానికి ఏమీ ఉండదు. వేరే ఫీల్డ్‌ అబ్బాయి అయితే అన్ని విషయాలను గురించి ఒకరితో ఒకరం మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. ఇతర విషయాల గురించి తెలుసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందుకే నేను ఇతర ఇండస్ట్రీకి చెందిన అబ్బాయిని పెళ్లి చేసుకోవడం కోసం ఎదురు చూస్తున్నాను అంది. ప్రస్తుతానికి తాను సింగిల్‌గానే ఉన్నాను అని, వచ్చే ఏడాదిలో పెద్దలు చూసిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను అంటూ చెప్పుకొచ్చింది.

Tags:    

Similar News