రెడ్ కలర్ డ్రెస్సులో హీటెక్కించిన దక్ష

చూడగానే ఆకట్టుకునే అందంతో పాటు మంచి హైట్ ఉండే దక్ష నగార్కర్ మోడలింగ్ లో కెరియర్ స్టార్ట్ చేసింది

Update: 2024-09-01 12:30 GMT
రెడ్ కలర్ డ్రెస్సులో హీటెక్కించిన దక్ష
  • whatsapp icon

టాలీవుడ్ లో హీరోయిన్స్ గా పరిచయం అయిన కొంతమంది కథానాయకిలు అందం, అభినయం ఉన్న కూడా అదృష్టం కలిసి రాకపోవడంతో ఆశించిన స్థాయిలో గుర్తింపు పొందలేకపోయారు. సక్సెస్ ఉన్నా లేకున్నా కొందరు అడపాదడపా సినిమాలు చేస్తూ వస్తూ ఉంటారు. ఇక భారీ హిట్స్ లేకున్నా కూడా అందంతో ఇట్టే ఆకట్టుకునే బ్యూటీలలో దక్ష నగార్కర్ ఒకరు.

చూడగానే ఆకట్టుకునే అందంతో పాటు మంచి హైట్ ఉండే దక్ష నగార్కర్ మోడలింగ్ లో కెరియర్ స్టార్ట్ చేసింది. 2015లో తేజ దర్శకత్వంలో వచ్చిన హోరాహోరీ మూవీలో దక్ష హీరోయిన్ గా అవకాశం అందుకుంది. ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. తరువాత 2018లో హుషారు మూవీలో నటించింది. ఈ సినిమాతో మంచి గుర్తింపు అందుకుంది. తరువాత ప్రశాంత్ వర్మ జాంబీరెడ్డిలో ఇంటరెస్టింగ్ రోల్ లో దక్ష కనిపించింది.

ఈ మూవీ సూపర్ హిట్ అయ్యింది. నాగార్జున బంగార్రాజు మూవీలో క్యామియో రోల్ లో కనిపించింది. రావణాసుర చిత్రంలో ఓ కీలక పాత్రలో దక్ష నటించింది. చివరిగా ఈ ఏడాది రిలీజ్ అయిన లవ్ మీ చిత్రంలో క్యామియో అపీరియన్స్ ఇచ్చింది. ఆమె హీరోయిన్ గా చేసింది అంటే కేవలం రెండు సినిమాలలోనే. తరువాత పెద్దగా ఇంపాక్ట్ చేసే క్యారెక్టర్ లలో నటించలేదు.

అయితే అందం, గ్లామర్ షో పరంగా దక్ష నగార్కర్ ముందు వరుసలోనే ఉంటుంది. ఇన్ స్టాగ్రామ్ లో ఈ బ్యూటీ యాక్టివ్ గా తన రెగ్యులర్ అప్డేట్స్ పంచుకుంటుంది. గ్లామర్ ఫోటోషూట్ లని కూడా షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా రెడ్ కలర్ అవుట్ ఫిట్ లో అదిరిపోయే అందంతో ఉన్న ఫోటోలని దక్ష నగార్కర్ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ లుక్స్ తో దక్ష చాలా అద్భుతంగా కనిపిస్తోంది.

Tags:    

Similar News