మహారాణిగా రీతు వర్మ.. స్వాగ్ చూపిస్తుందా?

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరియర్ స్టార్ట్ చేసిన తెలుగమ్మాయి రీతు వర్మ ‘నా రాకుమారుడు’ మూవీతో హీరోయిన్ గా మారింది.

Update: 2024-09-30 05:15 GMT

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరియర్ స్టార్ట్ చేసిన తెలుగమ్మాయి రీతు వర్మ ‘నా రాకుమారుడు’ మూవీతో హీరోయిన్ గా మారింది. తరువాత ‘పెళ్లి చూపులు’ సినిమాతో హీరోయిన్ గా కమర్షియల్ బ్రేక్ అందుకుంది. అప్పటి నుంచి ఈ బ్యూటీ రెగ్యులర్ గా మూవీస్ చేస్తూ వస్తోంది. తెలుగుతో పాటు, తమిళ్, మలయాళీ భాషలలో కూడా రీతు వర్మ హీరోయిన్ గా రానిస్తోంది. అయితే ఆమె తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేసింది. గ్లామర్ రోల్స్ చేయకపోయిన కూడా రీతు వర్మ హీరోయిన్ గా తనదైన ముద్ర వేసుకుంది.

ఆమె చివరిగా గత ఏడాది ‘మార్క్ ఆంటోనీ’ సినిమాలో విశాల్ కి జోడీగా నటించింది. తెలుగులో చిన్న హీరోల నుంచి మీడియం రేంజ్ స్టార్స్ వరకు అందరితో రీతు వర్మ మూవీస్ చేస్తోంది. శర్వానంద్, నాని, నాగశౌర్య లాంటి స్టార్స్ తో కూడా జతకట్టింది. ఇదిలా ఉంటే ఆమె శ్రీవిష్ణుకి జోడిగా నటించిన ‘స్వాగ్’ మూవీ అక్టోబర్ 4న ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. హసత్ గోలీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ డిఫరెంట్ కాన్సెప్ట్ తో రెండు టైం లైన్స్ లో ఉండబోతోంది.

ఈ సినిమాలో రీతు వర్మ రెండు వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్ లో నటిస్తోంది. అందులో స్త్రీస్వామ్య పాలన చేసే వింజామర వంశ మహారాణి రుక్మిణీ దేవి పాత్ర ఒకటి. పురుషాధిక్యంపై ధిక్కార స్వరం వినిపించే క్యారెక్టరైజేషన్ తో రీతు వర్మ పాత్ర ఉండబోతోందని తెలుస్తోంది. ఆమె కెరియర్ లో చేస్తోన్న చాలా బలమైన క్యారెక్టర్స్ లలో ఇది ఒకటనే మాట వినిపిస్తోంది. స్వాగ్ మూవీలో రీతు వర్మ క్యారెక్టర్ హైలైట్ అవుతుందని మేకర్స్ చెబుతున్నారు.

కెరియర్ లో ఫస్ట్ టైం పెర్ఫార్మెన్స్, వేరియేషన్ కి స్కోప్ ఉన్న పాత్రని స్వాగ్ చిత్రంలో చేస్తున్నట్లు చెప్పింది. ఈ మూవీ సక్సెస్ అయితే కచ్చితంగా సౌత్ లో ఆమె ఇమేజ్ అమాంతం పెరిగిపోతుందని సినీ విశ్లేషకులు అంటున్నారు. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా ‘స్వాగ్’ సినిమాని తెరకెక్కించారు. వింజామర మహారాణిగా రీతు వర్మ పెర్ఫార్మెన్స్ ఈ చిత్రంలో ఉంటుందనే ఆసక్తి అందరిలో నెలకొని ఉంది.

ఇదిలా ఉంటే రీతువర్మ ‘మోడ్రన్ లవ్ హైదరాబాద్’, ‘మోడ్రన్ లవ్ చెన్నై’ సిరీస్ లతో డిజిటల్ ఆడియన్స్ కి కూడా చేరువ అయ్యింది. ప్రస్తుతం హాట్ స్టార్ ఒరిజినల్ వెబ్ సిరీస్ లో కూడా రీతు వర్మ నటిస్తోందని టాక్ వినిపిస్తోంది. అలాగే తెలుగు తమిళ్ భాషలలో కొన్ని సినిమాలు డిస్కషన్ దశలో ఉన్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News