కవల పిల్లలకు జన్మనిచ్చిన 'గొడవ' హీరోయిన్‌

సినిమాలతో మెప్పించలేక పోయిన శ్రద్దా ఆర్య బుల్లి తెరపై పలు సీరియల్స్ చేసి ఆకట్టుకుంది. ముఖ్యంగా కుండలి భాగ్యలో మెప్పించింది. నాచ్‌ బలియే 9లోనూ వినోదాన్ని పంచింది.

Update: 2024-12-03 11:30 GMT

తెలుగు ప్రేక్షకులకు వైభవ్‌ హీరోగా నటించిన 'గొడవ' సినిమాతో పరిచయం అయిన ముద్దుగుమ్మ శ్రద్దా ఆర్య. తెలుగుతో పాటు హిందీ, తమిళ్‌, కన్నడ భాషల సినిమాల్లో నటించి మెప్పించిన శ్రద్దా ఆర్యకి లక్‌ కలిసి రాకపోవడంతో స్టార్‌ డం దక్కలేదు. ఏ భాషలోనూ ఎక్కువ కాలం మరిన్ని సినిమాలు చేసే అవకాశాలు రాలేదు. చేసిన ప్రతి సినిమాలోనూ తన బెస్ట్‌ ఇచ్చేందుకు ప్రయత్నించి, తన అందంతో మెప్పించేందుకు ప్రయత్నించిన శ్రద్దా ఆర్య గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న విషయం తెల్సిందే. తాను తల్లిని అయ్యాను అంటూ సోషల్‌ మీడియా ద్వారా గుడ్‌ న్యూస్‌ను శ్రద్దా ఆర్య షేర్‌ చేశారు.


సినిమాలతో మెప్పించలేక పోయిన శ్రద్దా ఆర్య బుల్లి తెరపై పలు సీరియల్స్ చేసి ఆకట్టుకుంది. ముఖ్యంగా కుండలి భాగ్యలో మెప్పించింది. నాచ్‌ బలియే 9లోనూ వినోదాన్ని పంచింది. 2021లో వైవాహిక జీవితంలో అడుగు పెట్టింది. రాహుల్ నాగల్‌ను వివాహం చేసుకున్న శ్రద్దా ఆర్య ఇటీవల కవల పిల్లలకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించింది. కొన్ని నెలల క్రితం ఈమె గర్భవతి అంటూ వార్తలు వచ్చాయి. అప్పటి నుంచి పలు వార్తలు సోషల్‌ మీడియా ద్వారా శ్రద్దా ఆర్య గురించి చక్కర్లు కొడుతూ వచ్చాయి.

ఇప్పుడు శ్రద్దా అధికారికంగా తన కవల పిల్లలతో తీసుకున్న వీడియోను షేర్‌ చేయడంతో పుకార్లకు చెక్‌ పెట్టింది. కవల పిల్లలో ఒకరు మగ కాగా, మరొకరు ఆడ కావడం విశేషం. గత నెల 29న తన పిల్లలు జన్మించారని శ్రద్దా ఆర్య ప్రకటించింది. ప్రస్తుతం పిల్లలతో పాటు శ్రద్దా ఆర్య ఆరోగ్యంగా ఉన్నారు. త్వరలోనే శ్రద్ద తన పిల్లల ఫేస్‌లను రివీల్‌ చేసే అవకాశాలు ఉన్నాయని ఆమె ఫ్యాన్స్ సోషల్‌ మీడియా ద్వారా ఆశా భావం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కవల పిల్లలకు జన్మనిచ్చిన శ్రద్దాకి నెటిజన్స్ పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

1987, ఆగస్టు 17న జన్మించిన శ్రద్దా ఆర్య 2006లో తమిళ సినిమా కాల్వనిన్ కాదలి, హిందీ సినిమా నిశ్శబ్ద్‌ తో ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. మొదటి సినిమా నిరాశపరచడంతో ఆఫర్లు ఆశించిన స్థాయిలో దక్కలేదు. కానీ లక్కీగా ఈమెకు తెలుగు, తమిళ్‌, హిందీ, కన్నడ భాషల్లో నటించే అరుదైన ఘనత దక్కింది. సినిమాలతో పాటు సీరియల్స్‌ లోనూ శ్రద్దా నటించింది. వచ్చిన ప్రతి అవకాశంను సద్వినియోగం చేసుకున్న శ్రద్దా ఆర్య పిల్లలకు తల్లి కావడంతో నటనకు కాస్త గ్యాప్‌ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. పిల్లలు పెద్ద వారు అయ్యాక మళ్లీ నటిగా సెకండ్‌ ఇన్నింగ్స్ మొదలు పెట్టేనా చూడాలి.

Tags:    

Similar News