నేను సైతం అంటూ సిమ్రాన్ ముందుకు!
జస్టిస్ హేమ కమిటీ నివేదిక దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 6 Sep 2024 11:18 AM GMTజస్టిస్ హేమ కమిటీ నివేదిక దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. బాధితులంతా తమకు జరిగిన అన్యాయం గురించి దైర్యంగా బయటకొచ్చి చెబుతున్నారు. హేమ కమిటీ లాంటింది కన్నడ, తెలుగు పరిశ్రమల్లో సైత రావాలని పలువురు నటీమణులు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి కమిటీల ద్వారానే కామాంధుల ఆటకట్టించడానికి వీలువుతుందని అంటున్నారు.
ఈ నేపథ్యంలో తాజాగా సీనియర్ నటి సిమ్రాన్ కూడా నేను సైతం అంటూ ముందుకొచ్చారు. `బాధితులంతా ముందుకొస్తున్నారు. అందులో నేను కూడా ఉన్నాను. నేను కూడా అలాంటి బాధితురాలినే. చిన్న వయసులో ఇలాంటి సమస్యలు ఎదుర్కున్నాను. కానీ వాటి గురించి వివరంగా ఇప్పుడు చెప్పలేను. వేధింపులకు గురైనప్పుడు వెంటనే ఎందుకు చెప్పలేదని చాలా మంది ప్రశ్నిస్తున్నారు.
ఇలా ప్రశ్నించడం అన్నది దారుణమైన చర్య. అలాంటి సంఘటనల గురించి వెంటనే ఎలా చెప్పగలం. మన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికే చాలా సమయం పడుతుంది. సహానం పాటించి ఆలోచించిన తర్వాతే రియాక్ట్ అవ్వగలం. మరికొంత మంది భయంతో...సమాజంలో ఏమవుతుందోనన్న భయంతో రారు.
వాళ్లకు అంత ధైర్యం ఉండదు. అలాంటి వారు చాలా మంది ఉంటారు. కానీ జరిగిన వెంటనే ఏ మహిళా ఇలాంటి వాటి గురించి చెప్పుకోలేదు. పరిస్థితిని అంతా అర్దం చేసుకోవాలి. ఇప్పుడంతా బయటకు వచ్చి మాట్లాడుతున్నారంటే? దాని వెనుక ఎంతో పెయిన్ ఉందని అర్దం చేసుకోవాలి` అని అన్నారు.