ట్రిప్తి దిమ్రీ సిసలైన సంక్రాంతి లుక్ చూశారా?
ట్రిప్తి దిమ్రీ పరిచయం అవసరం లేదు. యానిమల్, బ్యాడ్ న్యూజ్ లాంటి చిత్రాలతో ఈ బ్యూటీ విజయాలు అందుకుంది.
ట్రిప్తి దిమ్రీ పరిచయం అవసరం లేదు. యానిమల్, బ్యాడ్ న్యూజ్ లాంటి చిత్రాలతో ఈ బ్యూటీ విజయాలు అందుకుంది. నటిగా ఒక్కో మెట్టు ఎక్కుతున్న క్రమంలోనే ట్రిప్తి ఆషిఖి 3, ధడక్ 2 లాంటి సీక్వెల్ సినిమాల్లో అవకాశాలు అందుకుంది. ఇలాంటి సమయంలో ట్రిప్తికి అవకాశాలు అందినట్టే అంది మొహం చాటేస్తున్నాయని ప్రచారం సాగుతోంది. అయితే ట్రిప్తిపై పని గట్టుకుని కొందరు కుట్ర చేస్తున్నారంటూ ఇటీవల బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
అయితే ట్రిప్తి ఇలాంటి వాటికి స్పందించకుండా తన పనిపైనే శ్రద్ధ పెడుతోంది. ఈ భామ సోషల్ మీడియాల్లో అభిమానులకు నిరంతరం టచ్ లో ఉంది. తన ఫాలోవర్స్‌ని వరుస ఫోటోషూట్లతో యంగేజ్ చేస్తోంది. తాజాగా ట్రిప్తి డిజైనర్ శారీ లుక్ ఇన్ స్టాలో వైరల్ గా మారుతోంది. బాంబే టైమ్స్ ఈ కొత్త లుక్ ని షేర్ చేసి ఆసక్తికర క్యాప్షన్ ని ఇచ్చింది. ఈ ట్రెండ్ తో చీర విజువల్ గా మెస్మరైజ్ చేస్తోంది! అని వ్యాఖ్యను జోడించింది. ట్రిప్తి దిమ్రీ సహా ఆలియాభట్, జాన్వీ కపూర్ ల డిజైనర్ లుక్ లను కూడా బాంబే టైమ్స్ షేర్ చేయగా ఇవన్నీ వైరల్ గా మారుతున్నాయి. బాలీవుడ్ అందగత్తెల నుండి ప్రేరణ పొందిన డిజైనర్ శారీ, కార్సెట్ బ్లౌజ్ డిజైన్లను చూడండి.. వీటిని మీరు బుక్‌మార్క్ చేయాలి అంటూ నేటితరాన్ని టీజ్ చేసింది.
ట్రిప్తి శారీ లుక్ చూడగానే ఈ సంక్రాంతికి స్పెషల్ డిజైనర్ శారీ, కార్సెట్ బ్లౌజ్ లుక్ యూత్ కి స్ఫూర్తిగా నిలుస్తోందంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ కొత్త లుక్ ట్రిప్తి అందాన్ని పదింతలు పెంచింది. ప్రస్తుతం ఈ స్పెషల్ లుక్ ఇంటర్నెట్ లో సునామీ స్పీడ్ తో దూసుకుపోతోంది.
ఆషిఖి 3 ఆఫర్ కోల్పోయిందా?
బ్లాక్ బస్టర్ ఫ్రాంఛైజీ `ఆషిఖి`లో తాజా చిత్రం(ఆషిఖి 3)లో ట్రిప్తి ప్రధాన పాత్రలో నటిస్తోందంటూ కథనాలొచ్చిన సంగతి తెలిసిందే. అయితే ట్రిప్తీ ఈ సినిమా నుంచి తప్పుకుంది అంటూ ఒక వర్గం మీడియాలో ప్రచారమైంది. అయితే ఈ పాత్ర కోసం దర్శకనిర్మాతలు తెరపై మరింత స్వచ్ఛమైన అమాయకంగా కనిపించే అమ్మాయి కావాలని భావిస్తున్నట్టు కథనాలొస్తున్నాయి. ప్రస్తుతం కథానాయికను వెతుకుతున్నారని కూడా గుసగుసలు వినిపించాయి. ట్రిప్టీ ఇటీవల పరిణతి చెందిన, బోల్డ్ పాత్రలలో కనిపించింది. అందువల్ల ఆషిఖి 3లో పాత్రకు సరిపోదు అన్న ప్రచారం సాగింది.
జూమ్ కథనం ప్రకారం..ఆషికి 3లో ప్రధాన పాత్ర పోషించడానికి కీలకమైన అంశం `అమాయకత్వం`. అది ట్రిప్తీలో లేదని చిత్ర బృందం గమనించింది. కథానాయిక పాత్ర ప్రవర్తనలో స్వచ్ఛత అవసరం. ఆషికి ఒక క్లాసిక్, హృదయాలను టచ్ చేసే అందమైన ప్రేమకథ. అందుకే అలాంటి నటి కోసం వేచి చూస్తున్నారన్న ప్రచారం సాగింది. కానీ దీనిని దర్శకుడు అనురాగ్ బసు ఖండించారు.