40 ప్లస్ భామకు ఫ్లాపుల బెంగే లేదు
నలభై వయసులోను త్రిష పరిశ్రమలో క్వీన్ గా వెలిగిపోతోంది. ఇటీవల వరుసగా అగ్ర హీరోల సరసన అవకాశాలు అందుకుంటోంది.
నలభై వయసులోను త్రిష పరిశ్రమలో క్వీన్ గా వెలిగిపోతోంది. ఇటీవల వరుసగా అగ్ర హీరోల సరసన అవకాశాలు అందుకుంటోంది. మెగాస్టార్ చిరంజీవి విశ్వంభరలో నటిస్తున్న త్రిష, అజిత్ , కమల్ హాసన్, సూర్య లాంటి స్టార్లతో వరుస చిత్రాల్లో నటిస్తోంది. ప్రస్తుతం అజిత్ సరసన నటించిన విదాయుముర్చి థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా పాన్ ఇండియాలో విడుదలై ఫ్లాప్ గా మిగిలింది. ఇది కేవలం బాక్సాఫీస్ వద్ద 140 కోట్ల మేర వసూలు చేసింది. అయితే అంతకుమించి ఈ సినిమాకి బడ్జెట్ ఖర్చయింది. దీంతో ఇది ఫ్లాప్ మూవీ అన్న టాక్ వినిపిస్తోంది. మరోవైపు త్రిష మలయాళంలో ఓ చిత్రంలో నటించింది. కానీ ఈ సినిమా కూడా ఇటీవల విడుదలై ఫ్లాపైంది.
తదుపరి విడుదలకు రానున్న చిరంజీవి- విశ్వంభర, కమల్ హాసన్ - థగ్ లైఫ్ తనకు మంచి బ్రేక్ ఇస్తాయని త్రిష భావిస్తోంది. విశ్వంభర సోషియో ఫాంటసీ చిత్రం. ఇందులో త్రిషకు నటించే అవకాశం ఉన్న పాత్రలో ఆఫర్ ఇచ్చారని టాక్ వినిపించింది. అలాగే కమల్ హాసన్, మణిరత్నం కలయికలోని థగ్ లైఫ్ సినిమాకి బోలెడంత బజ్ ఉంది. ఇందులో త్రిష పాత్రకు ఎలాంటి హంగులు అద్దారో ఫస్ట్ లుక్ వీడియోలు వచ్చాక అర్థమవుతుంది.
మరోవైపు త్రిష యువదర్శకులు వినిపించిన కథలు వింటోందని సమాచారం. మునుముందు తెలుగు, తమిళం సహా పలు ప్రాజెక్టుల్లో త్రిష పేరు వినిపించనుందని తెలిసింది. ప్రస్తుతానికి సైలెంట్ గా ఉన్న ఈ బ్యూటీ అనవసరమైన ప్రచారానికి దూరంగా ఉంటోంది. ఇటీవల తన సోషల్ మీడియా హ్యాకవ్వగా, పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.