గ‌ర్భంతో మందు తాగిన న‌టి..

తాజాగా ఓ న‌టి గ‌ర్భందాల్చిన త‌ర్వాత ఆల్కాహాలు తీసుకోవ‌డం సంచ‌ల‌నంగా మారింది.

Update: 2024-09-07 07:47 GMT

గ‌ర్భం దాల్చితే ఆ మ‌హిళ ఎంతో జాగ్ర‌త్త‌గా ఉండాలి. అంత‌కు ముందు ఎన్నిర‌కాల అల‌వాట్టు ఉన్నా? అన్నింటిని త‌ప్ప‌క మానుకోవాలి. పుట్టే బిడ్డ కోసం తాను చేయాల్సింద‌ల్లా తూచ త‌ప్ప‌కుండా చేస్తేనే బిడ్డ క్షేమంగా బ‌య‌ట‌కు వ‌స్తుంది. లేదంటే ఆ ప‌సికందు స‌హా త‌ల్లి ప్రాణానికి ఇబ్బందులు త‌ప్ప‌వు. తాజాగా ఓ న‌టి గ‌ర్భందాల్చిన త‌ర్వాత ఆల్కాహాలు తీసుకోవ‌డం సంచ‌ల‌నంగా మారింది.

ఇంత‌కీ ఎవ‌రా? న‌టి ఎందుక‌లా జ‌రిగింది? అంటే వివ‌రాల్లోకి వెళ్లాల్సిందే. ఆమె ఎవ‌రో కాదు క‌మెడీయ‌న్ భార‌తీ సింగ్. గ‌ర్భం దాల్చిన ఏడు వార‌ల త‌ర్వాత ఆల్కాహాలు తీసుకున్న‌ట్లు తెలిపింది. ఆ సంగ‌తేంటో ఆమె మాట‌ల్లోనే..` నా ప్రెగ్నెన్సీ గురించి చాలా ఆల‌స్యంగా తెలుసుకున్నాను. అప్ప‌టివ‌ర‌కూ పార్టీల‌కు వెళ్తూ హాయిగా ఎంజాయ్ చేసే దాన్ని. ఎంచ‌క్కా క‌డుపు నిండా తింటూ తిరిగేదాన్ని.

అనుకోకుండా ఓ రోజు గ‌ర్బానికి సంబంధించిన కిట్ కనిపించడంతో స‌ర‌దాగా ట్రై చేసాను. కానీ ఫ‌లితంలో పాజిటివ్ అని వ‌చ్చింది. ఈ విష‌యాన్ని నా భ‌ర్త‌కు ఫోన్ చే సి చెప్పాను. దీంతో అత‌డు షాక్ అయ్యాడు. అత‌డు న‌మ్మ‌లేదు. ఇంటికెళ్లిన త‌ర్వాత ఆసుప‌త్రికి తీసుకెళ్లి ప‌రీక్ష చేయించాడు. అక్క‌డా పాజిటివ్ అని తెలిసింది. దీంతో మా ఆనందానికి అవ‌దుల్లేవ్. అప్ప‌టివ‌ర‌కూ గ‌ర్బం గురించి ఎంతో ఆలోచించాం.

కానీ ఆ స‌మ‌యంలో రాలేదు. గ‌ర్భం వ‌చ్చిన త‌ర్వాత మా సంతోషం మాట‌ల్లో చెప్ప‌లేనిది. గ‌ర్భం దాల్చిన త‌ర్వాత శిశువుడ‌కు ఏమాత్రం ఇబ్బంది వ‌చ్చినా? మ‌హిళ‌దే త‌ప్పు అంటారు. కానీ భ‌ర్త మానసిక ధైర్యాన్ని ఇస్తే ప్రెగ్నెన్సీ ని హ్యాండిల్ చేయ‌డం అన్న‌ది చాలా సుల‌భంగా ఉంటుంది. న‌న్ను బాగా అర్దం చేసుకునే భ‌ర్త దొరికాడు` అని తెలిపింది. భార‌తీ సింగ్ ర‌చ‌యిత , యాంక‌ర్ హ‌ర్ష లింబాచియాన్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది.

Tags:    

Similar News