పిక్‌ టాక్ : చీర కట్టులో 'చిట్టి' అందం

జాతిరత్నాలు సినిమాతో హీరోయిన్‌ గా పరిచయం అయిన తెలుగు ముద్దుగుమ్మ ఫరియా అబ్దుల్లా

Update: 2023-08-08 06:10 GMT

జాతిరత్నాలు సినిమాతో హీరోయిన్‌ గా పరిచయం అయిన తెలుగు ముద్దుగుమ్మ ఫరియా అబ్దుల్లా మొదటి సినిమాతోనే మంచి మార్కులు దక్కించుకుంది. హీరోయిన్ గా ఈ అమ్మడికి వరుస ఆఫర్లు వస్తాయని అంతా భావించారు. కానీ అదృష్టం కలిసి రాకపోవడంతో ఈ అమ్మడు మెల్ల మెల్లగా సినిమాల్లో నటిస్తూ వస్తుంది.


ఆ మధ్య రవితేజ సినిమాలో నటించిన ఫరియా అబ్దుల్లా ప్రస్తుతం రెండు మూడు సినిమాల్లో నటిస్తోంది. ఈ అమ్మడు సినిమాల్లో తక్కువ నటించినా సోషల్‌ మీడియాలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఈమె రెగ్యులర్ గా ఏదో ఒక కార్యక్రమంకు హాజరు అవ్వడంతో పాటు.. ఏదో ఒక ఫోటో షూట్ తో హడావిడి చేస్తూ వస్తోంది.

తాజాగా మరోసారి ఈ అమ్మడు చీర కట్టు తో అలరించింది. ఈసారి చీర కట్టు ఫోటోలతో కన్నుల విందు చేసింది. సాధారణంగా హీరోయిన్స్ చీర కట్టులో కనిపిస్తే చాలు నెటిజన్స్ ఫిదా అవుతూ ఉంటారు. ఇక ఫరియా వంటి హాట్ బ్యూటీస్ చీర కట్టులో కనిపిస్తే ఇంకేమైనా ఉందా... ఈ ఫోటోలు అందుకు సాక్ష్యం అన్నట్లుగా నెటిజన్స్ కామెంట్స్ వస్తున్నాయి.


జాతిరత్నాలు సినిమాలో చిట్టిగా మెప్పించిన ఈ అమ్మడు ఇంకా కూడా చిట్టిగానే ప్రేక్షకులతో పిలిపించుకుంటుంది. ఫరియా అబ్దుల్లా ఇలాంటి హాట్‌ అండ్ క్యూట్‌ ఫోటోలతో అలరిస్తే తప్పకుండా ముందు ముందు మరిన్ని మంచి సినిమాల్లో నటించే అవకాశాలు దక్కించుకోవచ్చు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

Tags:    

Similar News