అలాంటి క‌టౌట్ అనేవారు..కానీ ఛాన్సే ఇవ్వ‌లేదు!

సీనియ‌ర్ న‌టి జ‌య‌ల‌లిత అలియాస్ బోరింగ్ పాప గా టాలీవుడ్ జ‌ర్నీ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు

Update: 2024-03-07 14:30 GMT

సీనియ‌ర్ న‌టి జ‌య‌ల‌లిత అలియాస్ బోరింగ్ పాప గా టాలీవుడ్ జ‌ర్నీ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. 'చంటాబ్బాయి' తో కెరీర్ ప్రారంభించిన జ‌య‌ల‌లిత అటుపై ఎన్నో చిత్రాల్లో న‌టించారు. కెరీర్ ఆరంభంలో ఎక్కువ‌గా మ‌ల‌యాళ సినిమాలు చేయ‌డంతో ఆమె మ‌ల‌యాళీ అన్న సందేహం చాలా మందిలో ఉండేది. కానీ ఆమె స్వ‌స్థ‌లం కృష్ణా జిల్లాలోని గుడివాడ‌. సినిమాల‌పై ఫ్యాష‌న్ తో మ‌ద్రాసు ఇండ‌స్ట్రీలో ప్ర‌య‌త్నా లు చేసి స‌క్సెస్ అయిన న‌టి.

'ప‌ద‌హారేళ్ల అమ్మాయి'..'స‌త్యాగ్రహం'..'శ్రుతి ల‌య‌లు' లాంటి చిత్రాల్లో న‌టించారు. 'ఇంద్రుడు చంద్రుడు' త‌ర్వాత తెలుగు అవ‌కాశాలు ఎక్కువ రావ‌డంతో అప్ప‌టి నుంచి ఇక్క‌డే ఎక్కువ సినిమాలు చేసారు. ఎన్నో వైవిథ్య‌మైన పాత్ర‌లు పోషించి న‌టిగా త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన ఇమేజ్ ని క్రియేట్ చేసు కున్నారు. అప్ప‌ట్లోనే ఆమె ఎంతో అంద‌గ‌త్తెగానూ ఫేమ‌స్ అయ్యారు. హీరోయిన్ క‌టౌట్? క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా ప‌నిచేస్తుంద‌ని అప్ప‌టి అభిమ‌నుల్లో జ‌య‌ల‌లిత హాట్ టాపిక్ అయ్యారు.

తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో జ‌య‌ల‌లిత కెరీర్ గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసారు. ఆవేంటో ఆమె మాట‌ల్లోనే.. నా జీవితంలో అదృష్టం క‌న్నా దుర‌దృష్ట‌మే వెంటాడింది. అప్పట్లో ఎక్కడికి వెళ్లినా మీరు హీరోయిన్ కంటెంట్ మేడమ్' అనేవారు. కానీ ఎవరూ కూడా హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చేవారు కాదు. చాలా పాత్రలు చేతివరకూ వచ్చి జారిపోయాయి. అయినా నిరుత్సాహ పడిపోకుండా వచ్చిన పాత్రలను చేస్తూ వెళ్లాను. నాతో వ్యాంప్ రోల్స్ చేయించారుగానీ కానీ నిజానికి నాకు వ్యాంప్ ఎక్స్ ప్రెషన్ రాదు.

కానీ నేను చేసిన పాత్ర‌లు అలా సెట్ అవ్వ‌డంతో ఆ త‌ర‌హా పాత్ర‌ల‌కు ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ద‌క్కింది. నేను క్లాసికల్ డాన్సర్ ని . దీంతో ఎల్. విజయలక్ష్మి మాదిరిగా ఆ తరహా పాత్రలు వస్తాయేమోనని చూశాను . కానీ రాలేదు. నన్ను చూసినవారు కూడా 'ఇంతందంగా ఉన్నారు .. మిమ్మల్ని వ్యాంప్ పాత్రలకి ఎలా అడుగుతున్నారు అని అనేవారు. కానీ ఏం చేస్తాం ఫ్యామిలీని పోషించడం కోసం అలాంటి పాత్రలు చేయలేక తప్పలేదు' అని అన్నారు.

Tags:    

Similar News