ఆయనతో బిడ్డను కనాలనుకున్న జయలలితకు అడ్డు పడింది ఎవరు..?
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నిన్నటి తరం నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు జయలలిత
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నిన్నటి తరం నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు జయలలిత. మొదట్లో హీరోయిన్ ఛాన్సులు వచ్చినా ఆ తర్వాత ఆమెను కేవలం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే వినియోగించుకున్నారు. కెరీర్ పీక్స్ లో ఉన్న టైం లోనే పెళ్లి చేసుకున్న ఆమె భర్త చనిపోవడంతో మళ్లీ పెళ్లి చేసుకోలేదు. అప్పటి నుంచి ఒంటరి జీవితాన్ని కొనసాగించింది. తన ఫ్యామిలీ మెంబర్స్ నే తన సొంత మనుషులుగా చూసుకుంటూ వస్తున్నారు జయలలిత.
ఇక తన కెరీర్.. ఇన్నేళ్ల సినీ జీవితంలో ఎదురైన ఆటుపోట్లు.. తన అనుభవాలు ఇవన్నీ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు జయలలిత. పేరెంట్స్ ఇద్దరు కాలం చేశాక పూర్తిగా హైదరాబాద్ షిఫ్ట్ అయిన జయలలిత రమాప్రభ కు చాలా క్లోజ్ అయ్యారట. రమాప్రభ మాజీ భర్త శరత్ బాబు తో కూడా ఆమె క్లోజ్ గా ఉన్నారు. శరత్ బాబు, రమాప్రభ ని ఆమె అక్కా బావా అని పిలిచే వారని చెప్పారు.
అక్కకు ఏమైనా చెయ్ బావా అంటే ఇప్పటికే ఆమెకు చాలా చేశానని శరత్ బాబు తనతో చెప్పినట్టు జయలలిత చెప్పుకొచ్చారు. ఆయన మంచితనం వల్ల ఆధ్యాత్మిక బోధనల వల్ల శరత్ బాబుకి బాగా దగ్గరయ్యానని. ఆ తర్వాత ఆయనతో కలిసి తీర్ధ యాత్రలకు వెళ్లాలని చెప్పారు జయలలిత. ఇలా కలిసి తిరుగుతున్న టైం లో మా మధ్య ప్రేమ బంధం ఏర్పడిందని.. అది చాలా కాలం కొనసాగింది.. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నామని అయితే తనతో పెళ్లి వద్దని సినీ పరిశ్రమ వల్లే శరత్ బాబుకి చెప్పారని జయలలిత చెప్పుకొచ్చారు. అలా తమ పెళ్లి ఆగిపోయిందని అన్నారు ఆమె.
శరత్ బాబుని పెళ్లి చేసుకోవాలని ఒక బిడ్డను కనాలని తాను అనుకున్నానని కాకపోతే పెళ్లి పిల్లలు పుట్టాక మనిద్దరికీ ఏదైనా అయితే.. ఆస్తి కోసం పిల్లల్ని ఎవరైనా ఏదైనా చేస్తారని భావించి పెళ్లి చేసుకోలేదని చెప్పారు. ఆయన లైఫ్ లో అంతకుముందు ఏం జరిగింది అన్నది నాకు తెలియదు కానీ తన దృష్టిలో శరత్ బాబు ఒకరికి అన్యాయం చేయరని అన్నారు జయలలిత. ఆయన ఉండి ఉంటే జీవితాంతం ఆయనకు సేవ చేసుకుంటూ ఉండేదాన్ని రుణబంధం ఉన్నన్నాళ్లే మనుషుల మధ్య బంధాలు అన్నారు జయలలిత. ఆయన పేరు తన ఫోన్ లో తత్త్వ మసి అని ఉంటుందని అంతగా ఆయన్ను ఆరాధించానని చెప్పుకొచ్చారు జయలలిత.