కృతి స్టన్నింగ్ లుక్.. బ్లాక్ లోనే మతిపోగొట్టేసింది

కృతి సనన్ బాలీవుడ్ బ్యూటీ అయినప్పటికీ, తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. మహేష్ వన్ నేనొక్కడినే సినిమాతో ఇక్కడి వారికి పరిచయం అయ్యింది

Update: 2023-08-30 05:42 GMT
కృతి స్టన్నింగ్ లుక్.. బ్లాక్ లోనే మతిపోగొట్టేసింది
  • whatsapp icon

కొందరికి కెరీర్ మొదలుపెట్టిన వెంటనే సక్సెస్ రావచ్చు. కొందరికి ఆ సక్సెస్ అందుకోవడానికి కొంతకాలం పట్టొచ్చు. అయితే, ఆ వెయిట్ చేసిన కాలానికి తగిన ప్రతి ఫలం లభిస్తుంది. బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ విషయంలో అదే జరిగింది. కృతి 2014లో తన కెరీర్ ని మొదలుపెట్టింది. కానీ, ఆమెకు గుర్తింపు రావడానికి చాలా కాలం పట్టింది. ఇప్పుడు బాలీవుడ్ వన్ ఆఫ్ ది స్టార్ హీరోయిన్లలో కృతి కూడా ఒకరు. తాజాగా మిమి సినిమాకు గాను జాతీయ ఉత్తమ నటి అవార్డు కూడా అందుకుంది.


కృతి సనన్ బాలీవుడ్ బ్యూటీ అయినప్పటికీ, తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. మహేష్ వన్ నేనొక్కడినే సినిమాతో ఇక్కడి వారికి పరిచయం అయ్యింది. ఆ మూవీ లో కృతి అందాలకు అందరూ ఫిదా అయ్యారు. కానీ, ఆ సినిమా అనుకున్నంత పెద్ద క్లిక్ కాకపోవడంతో, ఆమె తెలుగు తెరకు దూరయమ్యారు. బాలీవుడ్ లో చిన్న సినిమాలు చేసుకుంటూ తన కెరీర్ మార్చుకుంది. చివరకు ఇటీవల అవార్డులు అందుకునే స్థాయికి ఎదిగింది.

ఈ అందాల భామ సోషల్ మీడియాలోనూ చాలా చరుకుగా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫోటోలను షేర్ చేస్తూ ఆకట్టుకుంటూ ఉంటుంది. తాజాగా కొన్ని ఫోటోలు షేర్ చేసింది. బ్లాక్ కలర్ మినీ డ్రెస్ లో మెరిసింది. ఆ డ్రెస్ కి మ్యాచింగ్ పొడవాటి సాక్సులు ధరించింది. ఈ డ్రెస్ లో కృతి అమేజింగ్ గా కనపడుతోంది. సింపుల్ లుక్ అయినా, ఆమె చూడటానికి చాలా ఎలిగెంట్ గా, క్లాసీగా కనపడుతోంది.

రీసెంట్ గా, కృతి సనన్ ప్రభాస్ తో కలిసి ఆదిపురుష్ మూవీలో నటించింది. జానకి పాత్రలో కృతి ఒదిగిపోయిన తీరు అందరినీ ఆకట్టుకుంది. మూవీపై ఎన్ని ట్రోల్స్ వచ్చినా, కృతి నటన విషయంలో ఒక్కరు కూడా ఒక్క వంక కూడా పెట్టలేదు. ఎందుకంటే, ఆమె అంత అద్భుతంగా నటించి, అందరినీ మెప్పించింది.

ప్రస్తుతం కృతి చేతిలో మంచి ఆఫర్లే ఉన్నాయి. అయితే, ఓ వైపు సినిమాలు చేస్తూనే, మరోవైపు సొంతంగా ఓ ప్రొడక్షన్ హౌస్ కూడా మొదలుపెట్టింది. తన ప్రొడక్షన్ హౌస్ తో కొత్తవారికి అవకాశాలు ఇవ్వాలని అనుకుంటోంది. తన సోదరి నుపుర్ తో కలిసి ఈ ప్రొడక్షన్ పనులు చూసుకుంటోంది. ఇక, ఆమె సోదరి నుపుర్ కూడా హీరోయిన్ గా నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తోంది. తెలుగులో వరసగా రెండు సినిమాలు చేస్తోంది.

Tags:    

Similar News