వయసు 50.. అందం 25
బాలీవుడ్ తో పాటు సౌత్ లో కూడా ఎన్నో ఐటం సాంగ్స్ ను చేసిన మలైకా అరోరా ఈ మధ్య కాలంలో సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదు
బాలీవుడ్ ప్రేక్షకులకు మలైకా అరోరా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. నటిగానే కాకుండా మోడల్ గా, వీజే గా, నిర్మాతగా ఎన్నో విధాలుగా ఇండస్ట్రీలో సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న విషయం తెల్సిందే. చేసిన సినిమాలు తక్కువే అయినా కూడా ఇండస్ట్రీలో ఆమె గుర్తింపు స్టార్ హీరోయిన్స్ స్థాయి లో ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. హీరోయిన్ గానే కాకుండా ఐటం సాంగ్స్ తో కూడా ఈ అమ్మడు మెప్పించింది. 1998 లో దిల్ సే సినిమాలో చయ్యా చయ్యా పాటలో నటించడం ద్వారా మొదటి సారి ఐటం తో మలైకా అరోరా అలరించింది.
బాలీవుడ్ తో పాటు సౌత్ లో కూడా ఎన్నో ఐటం సాంగ్స్ ను చేసిన మలైకా అరోరా ఈ మధ్య కాలంలో సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదు. నటిగా ఇప్పటికీ కూడా ఆమె కోరుకుంటే, నటించాలి అనుకుంటే ఏడాదికి మూడు నాలుగు సినిమాల్లో ఆఫర్లు వస్తాయి. కానీ ఆమె మాత్రం నటన పై పెద్దగా ఆసక్తి చూపడం లేదు. సోషల్ మీడియాలో మాత్రం తన అందమైన ఫోటోలను రెగ్యులర్ గా షేర్ చేయడం ద్వారా వార్తల్లో నిలుస్తోంది. అయిదు పదుల వయసు లో కూడా పాతిక సంవత్సరాల ప్రాయం తో అందంగా కనిపిస్తున్న ఈ అమ్మడు నెటిజన్స్ ను ఎప్పటికప్పుడు సర్ప్రైజ్ చేస్తూనే ఉంటుంది.
ఇన్స్టాగ్రామ్ లో దాదాపుగా 19 మిలియన్ల ఫాలోవర్స్ ను కలిగి ఉన్న మలైకా అరోరా తాజాగా షేర్ చేసిన ఈ ఫోటోలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. వైట్ టాప్ అండ్ షార్ట్ లో మలైకా ను చూస్తూ ఉంటే ఈమెకు 50 ఏళ్లు ఎలా అంటున్నారు. మూడు పదుల వయసులో హీరోయిన్స్ చాలా మంది వయసు అయిపోయిన మాదిరిగా కనిపిస్తారు. కానీ మలైకా అరోరా మాత్రం చాలా అందంగా ఇంకా పాతికేళ్ల పడుచు అమ్మాయిగా కనిపిస్తుంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ స్థాయి అందం మరే సీనియర్ హీరోయిన్స్ కి సాధ్యం కాదు అనే అభిప్రాయం ను కొందరు వ్యక్తం చేస్తున్నారు.
గతంలో హీరోయిన్ గా సినిమాలు చేయడం ద్వారా ఎంతో మందికి చేరువ అయిన ఈ అమ్మడు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో అందాల ఆరబోత ఫోటోలు షేర్ చేయడం ద్వారా హీరోయిన్స్ స్థాయి స్టార్డమ్ ను సొంతం చేసుకుంది. ఈ ఫోటోలు చూసిన చాలా మంది నెటిజన్స్ మళ్లీ మలైకా అరోరా సినిమాల్లో నటించాలని, ఆమె ను వెండి తెరపై మళ్లీ మళ్లీ చూడాలని కోరుకుంటున్నామని కామెంట్స్ చేస్తున్నారు. భర్త నుంచి విడి పోయిన తర్వాత ప్రస్తుతానికి సింగిల్ గానే ఉంటున్న మలైకా ఒక యంగ్ హీరోతో ప్రేమలో ఉందనే పుకార్లు షికార్లు చేస్తూ ఉన్నాయి. అయితే ఆ విషయాన్ని ఇద్దరూ నిర్ధారించడం లేదు. పెళ్లి విషయమై ఆమె నోరు మెదపడం లేదు.