లేడీ సూపర్ స్టార్ లోకేష్ రైటర్ తో ప్రయోగం!
లేడీ సూపర్ స్టార్ నయనతార సోలోగా సత్తా చాటడానికి ఎంతగా ప్రయత్నిస్తుందో తెలిసిందే
లేడీ సూపర్ స్టార్ నయనతార సోలోగా సత్తా చాటడానికి ఎంతగా ప్రయత్నిస్తుందో తెలిసిందే. ఇప్పటికే అమ్మడు కొన్ని లేడీ ఓరియేంటెడ్ చిత్రాలు చేసింది. కానీ అవేవి నయనతార సోలో ఇమేజ్ ని పెద్దగా ప్రోజెక్ట్ చేయలేదు. ఓవైపు కమర్శియల్ సినిమాలు చేస్తున్నా? నయన్ మనసంతా సోలో చిత్రాలపైనే ఉంది. గత ఏడాది ల్యాండ్ మార్క్ చిత్రంగా రిలీజ్ చేసిన 75వ సినిమా `అన్నపూర్ణి` కూడా సరైన ఫలితం సాధించ లేదు.
దీంతో నయన్ లేడీ ఓరియేంటెడ్ చిత్రాలపై మరింత కసిగా పనిచేసే ఆలోచనతో ముందుకు కదులుతుంది. సరైన కంటెంట్..డైరెక్టర్ కోసం ఎదురు చూస్తోంది. ఇటీవలే 14 ఏళ్ల పాటు డైరెక్షన్ కి దూరంగా ఉన్న శశి కుమార్ ని సైతం రంగంలోకి దించింది. మంచి స్టోరీ వినిపించడంతో శషి కిరణ్ ని డైరెక్టర్ గా ఎంపిక చేసుకుంది. ఇంత గ్యాప్ ఉన్న శషి కుమార్ తో సినిమా ఏంటి? అని కొన్ని విమర్శలొచ్చినా అమ్మడు వాటిని పట్టించుకోకుండా ముందుకు కదులుతుంది.
ఈ నేపథ్యంలో తాజాగా విష్ణు అనే మరో కొత్త కుర్రాడిని తెరపైకి తెచ్చింది. ఇతడు లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేసిన మాస్టర్.. విక్రమ్ సినిమాలు పనిచేసాడు. ఈ సినిమాలకు విష్ణు సాహిత్యం అందించాడు. ఆ సినిమాలో పాటలు మంచి విజయం సాధించాయి. తాజాగా దర్శకుడిగా కొత్త అవతారం ఎత్తాడు. నయన్ ఇమేజ్ ని ఆధారంగా చేసుకుని ఓ స్టోరీ వినిపించడం..అది ఆమెకి కనెక్ట్ అవ్వడంతో మరో ఆలోచన లేకుండా ఛాన్స్ ఇచ్చింది.
7 స్క్రీన్ స్టూడియోస్ ఈ చిత్రాన్ని నిర్మించడానికి ముందుకొచ్చింది. కథ నచ్చినప్పటికీ ఇంకా పైనల్ వెర్షన్ వినిపించాల్సి ఉందిట. ప్రస్తుతం విష్ణు..నయన్ తో చర్చలు జరుపుతున్నాడుట. త్వరలోనే అధికారికంగా ప్రాజెక్ట్ వివరాలు ప్రకటించనున్నారని సమాచారం. ప్రస్తుతం నయనతార డియర్ స్టూడెంట్స్ చిత్రంలో నటిస్తోంది. అలాగే కమిట్ అయిన ప్రాజెక్ట్ లు పట్టాలెక్కించే దిశగా ఆడుగులు వేస్తోంది.అయితే వాటితో పనిలేకుండా విష్ణు చిత్రాన్ని మాత్రం ముగిస్తుందని తెలుస్తోంది.