ఇలా ఓవర్ హీటెక్కిస్తే ఎలా అమ్మడు?
'చీకటి గదిలో చితక్కొట్టుడు' సినిమాతో తెలుగు యువతకు మైండ్ బ్లాక్ చేసిన ఈ బ్యూటీ రాఘవ లారెన్స్ 'కాంచన 3'లోనూ నటించిన సంగతి తెలిసిందే
బోల్డ్ అండ్ హాట్ బ్యూటీ నిక్కీ తంబోలి పరిచయం అవసరం లేదు. 'చీకటి గదిలో చితక్కొట్టుడు' సినిమాతో తెలుగు యువతకు మైండ్ బ్లాక్ చేసిన ఈ బ్యూటీ రాఘవ లారెన్స్ 'కాంచన 3'లోనూ నటించిన సంగతి తెలిసిందే. 'ఫియర్ ఫ్యాక్టర్: కాట్రోన్ కే ఖిలాడి' టీవీ షోలో కూడా నటించింది. హిందీ 'బిగ్ బాస్ 15' పార్టిసిపే షన్ తో మరింత ప్రజాదరణ పొందింది. ఈ బ్యూటీ వేడెక్కించే స్కిల్ గురించి ప్రత్యేకించి చెప్పనవరం లేదు. ఫోటోషూట్లలోనూ అద్భుతంగా ఎలా కనిపించాలో తెలుసు.
తాజాగా మరోసారి బోల్డ్ బికినీ లుక్ తో హీటెక్కిస్తోంది నిక్కీ. ఇదిగో ఇక్కడిలో బ్లాక్ టూ పీస్ లో సెగలు పుట్టిస్తుంది. క్లోజ్ షాట్ లో అమ్మడి అందాలు మరింత గా ఫోకస్ అవుతున్నాయి. సరిగ్గా సూర్యుడికి అభిముఖంగా సెల్పీ యాంగిల్ ఫిక్స్ చేసి దిగింది. అమ్మడి పై ఎర్రటి రవి కిరణాలు పడటంతో మరింత షైనింగ్ అవుతుంది. అమ్మడి బాడీలో మినిమం హీట్...భానుడి వేడి రెండు కలబోసి కుర్రాళ్లలో ఉష్ణోగ్రత స్థాయి లెవెల్స్ అమాంతం పెంచేసింది.
ప్రస్తుతం ఈ ఫోటో అంతర్జాలంలో వైరల్ గా మారింది. నిక్కీ ఫాలోవర్స్ హాట్ హాట్ కామెంట్లతో ఎటాకింగ్ చేస్తున్నారు. ఇలాంటివి అమ్మడికి కొత్తేం కాదు. ఇలా కాక పుట్టించే ఇన్ స్టాలో నాలుగు మిలియన్ల ఫాలోవర్స్ ని సంపాదించింది. సినిమాల్లో బిజీ కాలేకపోయినా సోషల్ మీడియా క్రేజ్ తో అటెన్షన్ డ్రా చేస్తుంది. కానీ అమ్మడు చేరుకోవాల్సిన లక్ష్యాలు మాత్రం చాలానే ఉన్నాయి. మరి ఆ దిశగా జర్నీ ఎలా ప్లాన్ చేసింది? అన్నది సస్పెన్స్.
సినిమాల్లోకి వచ్చిన తర్వాత మ్యూజిక్ వీడియోస్..బుల్లి తెరపై సైతం కనిపించింది. కానీ అమ్మడు అక్కడంత సీరియస్ గా పనిచేయలేదు. మనసు ఒక చోటు..మనిషి మరో చోట అన్నట్లే సాగింది. అలాగని వాటికి పుల్ స్టాప్ పెట్టలేదు. ఓవైపు సినిమా ప్రయత్నాలు చేస్తూనే సెకెండ్ ఆప్షన్ గా వాటిని బుల్లి తెరపై కనిపిస్తుంది.