బుట్ట‌బొమ్మ ప‌చ్చ చీర పింక్ గులాబీల క‌థేమి?

రామమందిరం ప్రారంభోత్సవం సందర్భంగా పూజా ఇలా సాంప్రదాయ అవతారంలో క‌నిపించి ఆశ్చ‌ర్య‌ప‌రిచింది

Update: 2024-01-23 04:21 GMT

ప‌చ్చ చీర.. ప‌చ్చ ర‌వికె.. పింక్ డిజైన‌ర్ ప‌రికిణీ.. కాంబినేష‌న్ గా త‌ల‌నిండుగా పింక్ గులాబీలు.. వ్వారెవ్వా ఈ లుక్కే అదుర్స్ అని పొగిడేయ‌కుండా ఉంటారా ఎవ‌రైనా? బాపు బొమ్మ‌లా ప్ర‌త్య‌క్ష‌మైంది అని కొందరు వ్యాఖ్యానిస్తుంటే బుట్ట‌బొమ్మ పింక్ గులాబీల క‌థేమి? అంటూ మ‌రికొంద‌రు ఆరాలు తీస్తున్నారు.


త‌లలో ఒక గులాబీ స‌రే కానీ.. బుట్ట‌బొమ్మ నాలుగైదు పింక్ గులాబీల‌ను ఎంత అందంగా జెడ నిండుగా తురిమిందో చూశాక మ‌న‌సు గిల‌గిల‌లాడిపోతోంది. పాత కాలం కోట లాంటి ఇల్లు సెట‌ప్.. చుట్టూ కొబ్బ‌రి చెట్లు ప‌చ్చ‌ద‌నంతో నేచుర్ గుండె గిల్లేస్తోంది. ఇక ఓల్డ్ హెరిటేజ్ భ‌వంతుల్లో బుట్ట‌బొమ్మ హొయ‌లు భంగిమ‌లు చూడ‌త‌ర‌మా?.. ప‌చ్చ కోక‌లో పూజా సింగారం మ‌తులు చెడగొడుతోంది.


రామమందిరం ప్రారంభోత్సవం సందర్భంగా పూజా ఇలా సాంప్రదాయ అవతారంలో క‌నిపించి ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. పూజ హాఫ్ శారీ లుక్ లో కనిపించింది. అందులో చూడముచ్చటగా కనిపించింది. అయితే ఈ చీరందాన్ని చూసిన త‌ర్వాత కాబోయే పెళ్లి కూతుళ్లు ఎంతో ముచ్చ‌ట‌పడిపోయి దాని ధర ఎంత అని ఆరాలు తీస్తున్నారు. ఇంత‌కీ ఇది ఏ బ్రాండ్? అంటూ వెబ్ లో వెతికేస్తున్నారు. ఈ డిజైన‌ర్ శారీ పాపుల‌ర్ బ్రాండ్ 'రా మ్యాంగో' షెల్ఫ్‌ల నుండి వచ్చింది. దీని ధర రూ.1.39 లక్షలు.


అయితే పూజా ఇలా ఏం చేసినా కానీ ఇటీవ‌ల త‌న‌పై ప్ర‌తికూల ప్ర‌భావం బ‌లంగా ప‌ని చేస్తోంది. త‌న‌పై నెగెటివిటీ స్ప్రెడ్ అవ్వ‌డంతో దాని ప్ర‌భావంతో వ‌రుసగా అవ‌కాశాల్ని కోల్పోయింది. గుంటూరు కారం చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటించాల్సి ఉంది. కానీ కొన్ని ఇత‌ర‌ సమస్యల కారణంగా మూవీ నుంచి బయటకు వెళ్లిపోయింది. త‌రవాత హ‌రీష్ శంక‌ర్ సినిమా నుంచి కూడా వైదొల‌గింద‌ని క‌థ‌నాలొస్తున్నాయి. ఇప్పుడు హిందీలో తన OTT అరంగేట్రానికి సిద్ధంగా ఉంది.


Tags:    

Similar News