కరోనా వైరస్ తో హీరోయిన్ గా ఎంట్రీ!
ముంబైలో పుట్టి పెరిగిన సాక్షి పిజియోథెరపిస్ట్ అట. డాక్టర్ గా ప్రజలకు సేవ చేయాలనుకుందిట
కరోనా వైరస్ తో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడం ఏంటి అనుకుంటున్నారా? అవును వైరస్ లు కూడా ఇలా హీరోయిన్ మారుస్తాయి అని ఓ నటి విషయంలో ప్రూవ్ అయింది. వివరాల్లోకి వెళ్తే.. సాక్షి వైద్య సుపరిచియతమే. 'ఏజెంట్' తో టాలీవుడ్ లో లాంచ్ అయిన అమ్మడు అటుపై 'గాండీవధారి అర్జున'లో నటించిన సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలు పరాజయం చెందాయి. వరుసగా రెండు వైఫల్యాలు ఎదురైనా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ఛాన్స్ అందుకుంది అంటే? అమ్మడికి కరోనా టైమ్ ఎంతగా కలిసొచ్చిందో చెప్పాలి కదా.
ముంబైలో పుట్టి పెరిగిన సాక్షి పిజియోథెరపిస్ట్ అట. డాక్టర్ గా ప్రజలకు సేవ చేయాలనుకుందిట. కానీ అనుకోకుండా నటిని అయ్యానంటోంది. కోవిడ్ సమయంలో ఇంట్లో ఖాళీగా బోర్ కొట్టడంతో రీల్స్ చేసి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిందిట. అప్పుడే స్నేహితులు ఇంత ట్యాలెంట్ ఉంది. సినిమాల్లో ప్రయత్నించ వచ్చు కదా? అని ఉచిత సలహా ఇచ్చారుట. ఆ సలహాని సీరియస్ గా తీసుకున్న అమ్మడు ఏజెంట్ ఆడిషన్ కి వెళ్లడం..అక్కడ సెలక్ట్ అవ్వడం అన్ని వేగంగా జరిగిపోయాయి అంది.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న 'ఉస్తాద్ భగత్ సింగ్ 'లోనూ హీరోయిన్ గా నటిస్తోంది. రెండు వైఫల్యాలు ఎదురైనా పీకే తో ఛాన్స్ అందుకుంది అంటే అమ్మడు ఎంత లక్కీ అన్నది కనిపిస్తూనే ఉంది. ఆ లక్ పుట్టుకతోనే ఉన్నట్లు తెలుస్తోంది. హీరోయిన్ అవ్వాలంటే బోలెడు స్టేజ్ లు దాటు కుని రావాలి. ముందుగా మోడలింగ్ లోకి రావాలి. ఆ తర్వాత పరిస్థితుల్ని బట్టి రకరకాల యాడ్స్ చేయాల్సి ఉంటుంది.
వాటి ద్వారా సినిమా దర్శకుల దృష్టిలో పడాలి. అవి వాళ్లకు నచ్చాలి. అప్పుడే ఛాన్స్ ఇచ్చేది. కానీ ఇవేవి లేకుండా షార్ట్ కట్ లో హీరోయిన్ అయిపోయింది సాక్షి. కానీ షార్ట్ కట్ లో విజయాలు మాత్రం రావు. ట్యాలెంట్ తోనూ నిరూపించుకోవాలి. రెండు వైఫల్యాలతో సాక్షిలో మ్యాటర్ బయటకు రాలేదు. ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత సాక్షి జర్నీ ఎలా ఉంటుంది? అన్నది ఓ క్లారిటీ వచ్చేస్తుంది.