ఫోటో స్టోరీ : స్టార్ తనయ అందాల బ్లాస్టింగ్..!

బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ తనయురాలు సారా అలీ ఖాన్ కూడా హీరోయిన్ గా దూసుకెళ్తున్న విషయం తెలిసిందే

Update: 2023-09-15 15:30 GMT

బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ తనయురాలు సారా అలీ ఖాన్ కూడా హీరోయిన్ గా దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ హీరోగా వచ్చిన కేదరనాథ్ సినిమాతో తెరంగేట్రం చేసిన ఆమె ఆరేళ్ల కెరీర్ లో 8 సినిమాలు చేసింది. స్టార్ తనయురాలు కదా అని అవకాశాలేమి ఊరికే రాలేదు. తనను తాను ప్రూవ్ చేసుకుంటుంది కాబట్టె సారా కి అవకాశాలు వస్తున్నాయి. ఈ ఇయర్ ఆల్రెడీ అమ్మడు మూడు సినిమాలు చేయగా ఒక సినిమాలో స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చింది.


అంతేకాదు సెట్స్ మీద సినిమాలు మరో నాలుగు ఉన్నాయి. అవి నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సినిమాలే కాదు సోషల్ మీడియాలో కూడా సారా సూపర్ యాక్టివ్ గా ఉంటుంది. ఆమె చేస్తున్న ఫోటో షూట్స్ అయితే ఫాలోవర్స్ ని మంత్ర ముగ్దుల్ని చేస్తున్నాయి. సారా అలీ ఖాన్ స్కిన్ షో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేస్తుంది. తను ఏం చేసినా సంథింగ్ స్పెషల్ గా ఉండాలని అనుకునే అమ్మడు ఫోటో షూట్స్ లో కూడా తన టాలెంట్ చూపిస్తుంది.

లేటెస్ట్ గా సారా ఇన్ స్టా లో షేర్ చేసిన ఫోటోస్ అయితే ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్నాయి. పరువాలన్ని ప్రదర్శిస్తూ తన సోయగాలతో ఆడియన్స్ ని తన వల్లో పడేసుకోవాలని చూస్తుంది అమ్మడు. ట్రెండీ వేర్ లో బ్యూటిఫుల్ లుక్స్ తో కనిపిస్తుంది సారా అలీ ఖాన్. సారా షేర్ చేసిన ఈ ఫోటో చూసిన ఎవరైనా సరే ఆమె మాయలో పడిపోవడం ఖాయమని చెప్పొచ్చు. స్టార్ తనయురాలిగా తన మీద ఉన్న ప్రెజర్ అంతా కూడా పక్కన పెట్టి తనకు ఏం చేయాలని అనిపిస్తే అదే చేస్తూ వస్తుంది సారా అలీ ఖాన్.

బాలీవుడ్ లో వచ్చిన ప్రతి ఛాన్స్ చేస్తూ వస్తున్న సారా సౌత్ సినిమాల మీద ఆసక్తి చూపిస్తుందని టాక్. ఆల్రెడీ తండ్రి సైఫ్ ఎన్.టి.ఆర్ దేవర సినిమాతో తెలుగు తెరంగేట్రం చేస్తున్నాడు. బాలీవుడ్ నుంచి ఆల్రెడీ జాన్వి, దీపిక, అలియా ఇలా అందరు తెలుగు సినిమాల్లో నటించారు. సారా కూడా వారి బాటలోనే తెలుగులో ఒక మంచి ఛాన్స్ కోసం చూస్తున్నట్టు తెలుస్తుంది. సారా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తే మాత్రం ఇక్కడ అమ్మడికి స్టార్ క్రేజ్ దక్కడం కన్ఫర్మ్ అని చెప్పొచ్చు.

Tags:    

Similar News