ఫోటో స్టోరి: రొయ్య పిల్ల‌లా నిగ‌నిగ‌లాడుతోంది

కెరీర్ మ్యాట‌ర్ కి వస్తే.. సారా అలీ ఖాన్ లక్ష్మణ్ ఉటేకర్ చిత్రం జరా హాట్కే జరా బచ్కే విడుదలై విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే

Update: 2024-01-29 03:52 GMT

అంద‌మైన భామ‌ల ఫ్యాష‌న్ ఎంపిక‌లు ప్ర‌తిసారీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నాయి. ముఖ్యంగా ఎంపిక చేసుకున్న డిజైన‌ర్ గౌన్ కి స్ఫూర్తి ఏమిట‌న్న‌ది అభిమానుల్లో ఆస‌క్తిని క‌లిగిస్తుంది. ముఖ్యంగా చాలా మంది డిజైనర్లు తాము ప్ర‌కృతి నుంచి లేదా స‌ముద్ర జ‌ల‌చ‌రాల ఆకృతుల‌ను స్ఫూర్తిగా తీసుకుని డిజైనింగ్ చేస్తామ‌ని చెబుతుంటారు. అయితే ఇప్పుడు సారా అలీఖాన్ ఎంపిక చేసుకున్న దుస్తులు అందుకు అతీతం కాదు.


''ఈ రూపం చూడ‌గానే రొయ్య పిల్ల‌లా నిగ‌నిగ‌లాడుతోంది. టైగ‌ర్ రొయ్య‌లా ఊరిస్తోంది!'' అంటూ అభిమానులు ఈ లుక్ పై కామెంట్లు చేస్తున్నారు. దానికి కార‌ణం సారా ఎంపిక చేసుకున్న దుస్తుల డిజైన్ రొయ్య (ప్రాన్) ఆకృతిని పోలి ఉండ‌డ‌మే. హోట‌ల్లో ప్రాన్ ఫ్రైని లొట్ట‌లేయ‌డ‌మే కాదు.. ఇలాంటి డిజైన‌ర్ లుక్కుల‌ను రూపొందించ‌గ‌ల‌మ‌ని స‌ద‌రు ఫ్యాష‌న్ డిజైన‌ర్ నిరూపించాడు! అంటూ కొంద‌రు నెటిజ‌నులు పొగిడేస్తున్నారు.


సారా అలీఖాన్ బ్లాక్ క‌ల‌ర్ ఛ‌మ్కీల లెద‌ర్ ఫ్రాకులో ఎంతో అందంగా క‌నిపించింది. ఈ థై స్లిట్ ఫ్రాకుపై రొయ్య ఫోటోని కూడా ముద్రించ‌డంతో అది హైలైట్ అయింది. మొత్తానికి సారా లుక్ కేంద్ర‌క ఆక‌ర్ష‌ణ‌గా మార‌డంతో కుర్ర‌కారు క‌ళ్ల‌న్నీ అటువైపే ఉన్నాయి.


కెరీర్ మ్యాట‌ర్ కి వస్తే.. సారా అలీ ఖాన్ లక్ష్మణ్ ఉటేకర్ చిత్రం జరా హాట్కే జరా బచ్కే విడుదలై విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. ఇందులో విక్కీ కౌశల్ సరసన నటించింది. ఈ రోమ్-కామ్ తర్వాత 'ఏ వతన్ మేరే వతన్'..మర్డర్ ముబారక్ చిత్రాల్లో న‌టిస్తోంది. న‌టిగా రోజురోజుకు షైన్ అవుతున్న సారా సోష‌ల్ మీడియాల్లోను భారీ ఫాలోవ‌ర్స్ తో బాగానే ఆర్జిస్తోంది.


Tags:    

Similar News