స్కామ్ బ్యూటీ బికినీ మాయ!
తెలుగు చిత్ర పరిశ్రమలో తెలుగమ్మాయిలు స్కిన్ షో చేయడానికి దూరంగా ఉంటారని చాలా మంది అనుకుంటారు.
తెలుగు చిత్ర పరిశ్రమలో తెలుగమ్మాయిలు స్కిన్ షో చేయడానికి దూరంగా ఉంటారని చాలా మంది అనుకుంటారు. కానీ, హైదరాబాద్ బ్యూటీ శ్రేయా ధన్వంతరి మాత్రం ఈ అభిప్రాయాన్ని పూర్తిగా తప్పుగా నిరూపిస్తోంది. తన గ్లామర్ షోతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ, సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది.
తెలుగులో కేవలం రెండు సినిమాలే చేసినా, శ్రేయా తన ఇన్స్టాగ్రామ్ ఫొటోషూట్స్‌తో అందరిని ఆశ్చర్యపరుస్తోంది. బికినీలు, పొట్టి డ్రెస్సులు, సింగిల్ బటన్ డ్రెస్సులతో ఆమె చేస్తున్న గ్లామర్ షో కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇటీవల బ్లాక్ కలర్ ట్రాన్స్ పేరెంట్ డ్రెస్ లో అమ్మడు బికినీ అందాలను హైలెట్ చేసింది. నవ్వుతూ దిగిన ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో నెటిజన్లు లైకుల వర్షం కురిపిస్తున్నారు.
హైదరాబాద్‌లోని తెలుగు ఫ్యామిలీకి చెందిన శ్రేయా, వరంగల్‌లోని నిట్ కాలేజీలో ఇంజనీరింగ్ చదివింది. బీటెక్ థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు ఫెమినా మిస్ ఇండియా కాంపిటీషన్లో రెండో స్థానంలో నిలిచింది. 2008లో మిస్ ఇండియా ఫైనలిస్ట్‌గా నిలిచిన శ్రేయా, ఆ తర్వాత మోడల్‌గా మంచి గుర్తింపు పొందింది. వివిధ యాడ్స్‌లో నటించి క్రేజ్ సంపాదించింది.
అక్కినేని నాగచైతన్య నటించిన 'జోష్' సినిమాలో ఒక సైడ్ క్యారెక్టర్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన శ్రేయా, సందీప్ కిషన్ నటించిన 'స్నేహగీతం' చిత్రంలో తన నటనతో లీడ్ రోల్ లో ఆకట్టుకుంది. కానీ, పెద్దగా గుర్తింపు రాలేదు. అనంతరం అమ్మడు బాలీవుడ్‌కి షిఫ్ట్ అయింది. అక్కడ వరుసగా షార్ట్ ఫిల్మ్స్, డాక్యుమెంటరీలు చేస్తూ బాలీవుడ్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది.
హిందీలో 'ఏ వైరల్ వెడ్డింగ్' మినీ సిరీస్‌లో నిషా పాత్రలో నటించి, దర్శకురాలిగా, నిర్మాతగా బాధ్యతలు చేపట్టింది శ్రేయా. 'ది ఫ్యామిలీ మ్యాన్', 'వై చీట్ ఇండియా', 'స్కామ్ 1992', 'లూప్ లపేటా', 'చుప్' వంటి ప్రాజెక్ట్‌లతో మంచి పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం 'అద్భుత్' మరియు 'నైసికియే' సినిమాల్లో నటిస్తోంది.
శ్రేయా ధన్వంతరి తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా మరిన్ని ప్రాజెక్ట్‌లను చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఆమె గ్లామర్ డోస్‌తో మరింత మాయ చేస్తుందని నెటిజన్లు ఆశిస్తున్నారు. మరి ఈ అందంతో అమ్మడు రాబోయే రోజుల్లో ఎలాంటి అవకాశాలు అందుకుంటుందో చూడాలి. అలాగే సొంతంగా ఒక వెబ్ సీరీస్ నిర్మించాలని ఈ బ్యూటీ ప్రయత్నం చేస్తున్నట్లు టాక్.