పాము పొర దుస్తుల్లో శ్రీయ స్టన్నింగ్ లుక్
పెళ్లి తర్వాతా శ్రీయ శరణ్ చెలరేగుతున్న సంగతి తెలిసిందే. భర్త ఆండ్రూ కోశ్చీవ్ తో కలిసి ముంబైలో ఈ బ్యూటీ నివశిస్తోంది
పెళ్లి తర్వాతా శ్రీయ శరణ్ చెలరేగుతున్న సంగతి తెలిసిందే. భర్త ఆండ్రూ కోశ్చీవ్ తో కలిసి ముంబైలో ఈ బ్యూటీ నివశిస్తోంది. అదే క్రమంలో హిందీ పరిశ్రమతో పాటు సౌత్ లో తన నటనా కెరీర్ ని రీలాంచ్ చేసింది. ఇంతలోనే స్టన్నర్ అనిపించే వరుస ఫోటోషూట్లతో శ్రీయ విరుచుకుపడుతోంది.
శ్రీయ శరణ్ ఇంతకుముందే శాటిన్ చీరలో మంత్రముగ్దులను చేసే లుక్‌తో ప్రత్యక్షమైంది. శాటిన్ సిల్క్ చీరలో అందాల ఆరబోసిన ఈ లుక్ కి అద్భుత స్పందన లభించింది. ఇంతలోనే ఇప్పుడు మరో కొత్త లుక్ తో ప్రత్యక్షమైంది. శ్రీయ పర్ఫెక్ట్ థై స్లిట్ డిజైనర్ ఫ్రాక్ ని ధరించి ఒంటికాలిపై ఇచ్చిన ఫోజ్ ఇప్పుడు అంతర్జాలాన్ని షేక్ చేస్తోంది. శ్రీయ ఫోజ్ చూడగానే.. ఆ డిజైనర్ డ్రెస్ ని తీర్చిదిద్దిన వైనం పరిశీలించగానే.. ఇది ఒక పాము పొరను విడిచే దృశ్యంలా ఎంతో మనోహరంగా కనిపిస్తోంది. శ్రియా శరణ్ తన ఇన్‌స్టాగ్రామ్ లో ఈ ఫోటోలను షేర్ చేసింది.
శ్రియా శరన్ 2001లో తెలుగు సినిమా ఇష్టంతో తన నటనా జీవితాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత 2003లో K విజయ భాస్కర్ దర్శకత్వం వహించిన తుజే మేరీ కసమ్‌తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఈ చిత్రంలో జెనీలియా డిసౌజా - రితేష్ దేశ్‌ముఖ్‌లతో కలిసి సహాయక పాత్రలో నటించింది.
శ్రియ ఇటీవల షోటైమ్ పేరుతో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సిరీస్‌లో కనిపించింది. సుమిత్ రాయ్ దీనికి సృష్టికర్త .. అర్చిత్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్‌లో నసీరుద్దీన్ షా, ఇమ్రాన్ హష్మీ, మహిమా మక్వానా, మౌని రాయ్, రాజీవ్ ఖండేల్‌వాల్, శ్రియా సరన్, విశాల్ వశిష్ఠ్ తారాగణం. ధర్మాటిక్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కరణ్ జోహార్, అపూర్వ మెహతా, సోమెన్ మిశ్రా, మిహిర్ దేశాయ్ నిర్మించారు. ఈ సిరీస్ మార్చి 8న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ప్రదర్శితమైంది. శ్రియా శరణ్ తదుపరి దృశ్యం 3, నరగాసూరన్ చిత్రాల్లో నటిస్తోంది.