శ్రీలీల జర్నీ మాటరాని మౌనం!
యువ నాయిక శ్రీలీల కెరీర్ జెట్ స్పీడ్ తో పరుగులెడుతోన్న సంగతి తెలిసిందే. పట్టిందల్లా బంగారమే అవుతుంది
యువ నాయిక శ్రీలీల కెరీర్ జెట్ స్పీడ్ తో పరుగులెడుతోన్న సంగతి తెలిసిందే. పట్టిందల్లా బంగారమే అవుతుంది. యంగ్ హీరోల నుంచి సీనియర్ హీరోల వరకూ ఎవర్నీ విడిచి పెట్టడం లేదు. అంది వచ్చిన ఏ అవకాశాన్ని వదలడం లేదు. సైన్ చేయడం..అడ్వాన్స్ తీసుకోవడం.. యాక్షన్ చెప్పడం అన్నట్లు సాగిపోతుంది. బాలయ్య...పవన్...మహేష్ లాంటి అగ్ర స్టార్ల నుంచి నితిన్..రామ్...వైష్ణవ్ తేజ్ అందర్నీ రౌండప్ చేసింది.
ప్రస్తుతం అమ్మడి లైనప్ లో ఉన్న ప్రాజెక్ట్ లు చూస్తే షాక్ అవ్వాల్సిందే. ఏ హీరోయిన్ లేనంత బిజీగా ఉంది. 'పెళ్లి సందడి' అనే చిన్న సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఈ రేంజ్ కి చేరుకుంది. అందం..అభినయంతో పాటు ఇక్కడ అమ్మడికి అదృష్టం కలిసొచ్చిందనాలి. ఎంతో మంది భామలున్నా! అవకాశాలన్ని ఆమెనే వెతుక్కుంటూ మరీ వెళ్తున్నాయి. అందంతా లక్ తో కాక మరేమనాలి. రష్మిక మందన్నా తర్వాత అంత వేగంగా పాపులర్ అయిన నటి శ్రీలీల మాత్రమే అనడంలో ఎలాంటి సందేహం లేదు.
తాజాగా ఈ జర్నీని ఎలా ఆస్వాదిస్తున్నారంటే? ఆ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కెరీర్ లో ప్రస్తుతం నా పరిస్థితి గురించి చెప్పాలంటే మాట రాని మౌనం. ఎలా స్పందిచాలా? అర్దం కాని స్థితిలో ఉన్నాను. ఓ రకమైన గందరగోళానికి గురవుతున్నాను. ఇదంతా నాకు చాలా కొత్తగా అనిపిస్తుంది. ఇంతకు ముందు జీవతం వేరు..ఇప్పుడు ఆనుభవిస్తోన్న జీవితం వేరు. రెండింటిని ఏమాత్రం పోల్చలేకపోతున్నాను.
ఇంత ప్రేమ..ప్రోత్సాహం ఇస్తున్నప్పుడు మరింత బాధ్యతగా పనిచేయాలని మాత్రం చాలా బలంగా అనుకుంటున్నాను. ప్రస్తుతం నా దృష్టి అంతా కెరీర పైనే పెట్టాను. ఓ క్లారిటీతో ముందుకు సాగాలనుకుంటున్నాను. స్కందలో నా పాత్ర క్లాస్ మాస్ మిక్స్ అయినట్లు ఉంటుంది. అలాగే డాన్సు పరంగా నేను క్లాసికల్ డాన్సర్ ని..కానీ ప్రేమ్ రక్షిత్ మాస్టర్ నాతో వెస్టర్న్ డాన్సు చేయించారు' అని అంది.