త్రిష పెళ్లి వీడియో వైరల్‌... సీక్రెట్‌ వ్యవహారం

టాలీవుడ్‌ తో పాటు కోలీవుడ్‌ ఇతర భాషల్లో దాదాపు రెండు దశాబ్దాలుగా హీరోయిన్ గా సందడి చేస్తున్న ముద్దుగుమ్మ త్రిష ఇప్పటికి కూడా బిజీగానే కొనసాగుతోంది

Update: 2023-08-20 07:12 GMT

టాలీవుడ్‌ తో పాటు కోలీవుడ్‌ ఇతర భాషల్లో దాదాపు రెండు దశాబ్దాలుగా హీరోయిన్ గా సందడి చేస్తున్న ముద్దుగుమ్మ త్రిష ఇప్పటికి కూడా బిజీగానే కొనసాగుతోంది. ఇప్పటికి కూడా సూపర్ స్టార్‌ విజయ్ వంటి స్టార్‌ హీరోలకు జోడీగా నటిస్తుంది అంటే త్రిష రేంజ్‌ ఏంటో అర్థం చేసుకోవచ్చు. హీరోయిన్ గా ఈ అమ్మడి జోరు కంటిన్యూ అవుతూనే ఉంది.

ప్రస్తుతం త్రిష తమిళంలో వరుస సినిమాలు చేస్తూ ఉంది. కొన్ని సంవత్సరాల క్రితం త్రిష వివాహ నిశ్చితార్థం అయింది. కానీ పెళ్లికి ముందు ఆ నిశ్చితార్థం క్యాన్సిల్‌ అయింది. అప్పటి నుండి ఇప్పటి వరకు త్రిష పెళ్లి గురించి ఎప్పుడూ ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. తాజాగా మరోసారి త్రిష పెళ్లి గురించిన వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ఈసారి అంతకు మించి అన్నట్లుగా త్రిష పెళ్లి వీడియో అంటూ కొందరు ఔత్సాహికులు సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తున్నారు. త్రిష అభిమానులు నిజంగానే పెళ్లి జరిగిందా అనుకుంటూ షాక్ అవుతున్నారు. త్రిష ను పెళ్లి చేసుకున్న ఆ వ్యక్తి ఎవరా అంటూ ఆరా తీయడం మొదలు పెట్టారు.. గూగుల్ లో కూడా తెగ వెతికేస్తున్నారు.

అసలు విషయం ఏంటంటే త్రిష పెళ్లి వార్తలు నిజం కాదు. ఆమె ఒక ప్రముఖ కంపెనీ జువెలరీ యాడ్‌ షూట్‌ సందర్భంగా పెళ్లి కూతురుగా మేకప్ అయింది. ఆ యాడ్‌ లో కొంత భాగంను కట్ చేసి త్రిష పెళ్లి అయింది అంటూ కొందరు హడావుడి చేస్తూ వైరల్‌ చేస్తున్నారు. ఆమెకు ఉన్న క్రేజ్ నేపథ్యం లో పెళ్లి వీడియో కొన్ని గంటల్లోనే వైరల్‌ అయ్యాయి.

Tags:    

Similar News