ముంబైలో కొత్త సంసారం మొదలు..!

కోలీవుడ్‌ తో పాటు టాలీవుడ్ లోనూ హీరోగా నటించి మెప్పించిన సిద్దార్థ్‌ ఇటీవల అదితి రావు హైదరి ని వివాహం చేసుకున్న విషయం తెల్సిందే.

Update: 2024-09-20 07:22 GMT

కోలీవుడ్‌ తో పాటు టాలీవుడ్ లోనూ హీరోగా నటించి మెప్పించిన సిద్దార్థ్‌ ఇటీవల అదితి రావు హైదరి ని వివాహం చేసుకున్న విషయం తెల్సిందే. వీరిద్దరికీ శర్వానంద్‌ హీరోగా నటించిన 'మహాసముద్రం' సినిమా షూటింగ్‌ సమయంలో పరిచయం అయింది. ఆ సినిమా తర్వాత కూడా ఇద్దరి మధ్య స్నేహం కంటిన్యూ అయింది. ఆ స్నేహం ప్రేమగా మారింది, చాలా కాలం పాటు ఇద్దరు సహ జీవనం సాగించారు. ఇద్దరికీ అంతకు ముందే వివాహం అవ్వడం జరిగింది. కొన్ని కారణాల వల్ల విడిపోయారు. ఇప్పుడు ఇద్దరూ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇద్దరి మధ్య ప్రేమ చిగురించి పెళ్లి పీటలు ఎక్కారు.

ఇటీవల తెలంగాణ రాష్ట్రంలోని వనపర్తి లో ఒక పురాతన ఆలయంలో కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత ఈ కొత్త జంట కొత్త సంసారం ఎక్కడ మొదలు పెట్టబోతున్నారు అనే ఆసక్తి అందరిలో వ్యక్తం అవుతోంది. చెన్నైలో సిద్దార్థ్‌ కి ఇల్లు ఉంది. కానీ ఈ కొత్త జంట ముంబైలో ఉండాలని భావిస్తున్నారట. ఇప్పటికే అదితి ఉంటున్న ఇంట్లో కొత్త సంసారం ను మొదలు పెట్టారని తెలుస్తోంది. ఇటీవలే ముంబై వెళ్లిన కొత్త జంట ఎయిర్‌ పోర్ట్‌ లో మీడియా కంట పడ్డారు. ఆ సమయంలో మీడియా వారు వారిని ఫోటోలు తీసేందుకు పరుగులు పెట్టారట.

ప్రస్తుతానికి అదితి రావు హైదరి ఇంట్లోనే ఉంటున్నారు. త్వరలోనే ముంబైలో ఒక ఖరీదైన ఇల్లును కొనుగోలు చేయాలని సిద్దార్థ్‌ ప్లాన్ చేస్తున్నాడట. అందుకు సంబంధించిన చర్చలు సైతం జరుగుతున్నాయని తెలుస్తోంది. తమిళ్‌, తెలుగు సినిమాల్లో నటిస్తూ ఉన్నప్పటికీ సిద్దార్థ్‌ ముంబై లో ఉండాలని నిర్ణయించుకున్నట్లుగా సమాచారం అందుతోంది. ముంబై లో సినీ సెలబ్రిటీలు ఉంటున్న ఏరియాలోనే ఇప్పుడు ఈ స్టార్‌ కపుల్‌ కొత్త ఇంటిని కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇద్దరూ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఉన్న కారణంగా బాగానే సంపాదన ఉన్నట్లు తెలుస్తోంది.

బాలీవుడ్‌ తో పాటు సౌత్ లోనూ హీరోయిన్ గా అదితి రావు హైదరి సినిమాలు చేసిన విషయం తెల్సిందే. ప్రస్తుతం అదితి హిందీలో ఒక వెబ్‌ సిరీస్‌ లో నటించడంతో పాటు ఒక తమిళ సినిమాలోనూ నటిస్తున్న విషయం తెల్సిందే. హీరోయిన్ గా అదితి రావు హీరోగా సిద్దార్థ్‌ కలిసి ఒక సినిమా చేసే అవకాశాలు ఉన్నాయి. ఒక తమిళ దర్శకుడు ఈ విషయమై వారితో చర్చలు జరిపాడని సమాచారం అందుతోంది. ఒక మంచి ఫీల్ గుడ్‌ కథ తో వస్తే తప్పకుండా చేద్దాం అని హామీ ఇచ్చాడట. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా సినిమా కథ ఉండేలా ప్లాన్‌ చేస్తున్నారు. కొత్త జీవితం ప్రారంభించిన వీరు ఎప్పుడూ సంతోషంగా కలిసి ఉండాలని ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు.

Tags:    

Similar News