పిక్‌టాక్ : బోల్డ్ లుక్‌లో హీరో గారి భార్య
తెలుగు అమ్మాయి అయినా బాలీవుడ్ సినిమాల్లో ఎక్కువగా కనిపించే ముద్దుగుమ్మ అదితి రావు హైదరి.
తెలుగు అమ్మాయి అయినా బాలీవుడ్ సినిమాల్లో ఎక్కువగా కనిపించే ముద్దుగుమ్మ అదితి రావు హైదరి. రాజ కుటుంబంకు చెందిన ఈ అమ్మడు బాలీవుడ్, కోలీవుడ్‌లో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. టాలీవుడ్‌లోనూ ఈమె పలు సినిమాల్లో నటించింది. మలయాళ సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈమె ఆ తర్వాత తమిళ్ మూవీ చేసింది, హిందీలో వరుసగా సినిమాలు చేయడంతో పాటు మరాఠి మూవీలోనూ కనిపించింది. తెలుగులో మొదటి సారి సమ్మోహనం అనే సినిమాలో నటించడం ద్వారా టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఇటీవల ఈమె ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్న విషయం మనం చూస్తూనే ఉన్నాం.
శర్వానంద్ హీరోగా నటించిన మహా సముద్రం సినిమాలో అదితి రావు హైదరీ హీరోయిన్‌గా నటించింది. ఆ సినిమాలో మరో ముఖ్య పాత్రలో నటించిన సిద్దార్థ్ నటించాడు. సినిమా షూటింగ్ సమయంలోనే సిద్దార్థ్, అదితి మధ్య పరిచయం, స్నేహం, ప్రేమ ఏర్పడింది. ఇద్దరూ అప్పటి నుంచి ప్రేమలో మునిగి తేలారు. దాదాపు మూడు సంవత్సరాలు వీరి ప్రేమ గురించి మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. ప్రేమ విషయాన్ని అధికారికంగా చెప్పకుండా అప్పుడప్పుడు కలిసి కార్యక్రమాలకు హాజరు కావడం వల్ల వీరు సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయ్యారు. ఎట్టకేలకు వీరిద్దరు పెళ్లి చేసుకుని మరోసారి వార్తల్లో నిలిచారు.
పెళ్లి తర్వాత సౌత్ ముద్దుగుమ్మలు సినిమాలకు దూరం అవుతారు అనే టాక్ ఉంది. కానీ అదితి రావు మాత్రం మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటుంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆకట్టుకునే అందంతో పాటు మంచి ఫిజిక్ ఈ అమ్మడి సొంతం అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తూ ఉంటారు. ఈసారి తన ఫిజిక్‌ను కాస్త బోల్డ్‌గా, బ్రా లేకుండా కోర్టు బటన్స్ విప్పి ప్రేక్షకులను కవ్విస్తూ సోషల్ మీడియాలో ఫోటోలను షేర్ చేయడం ద్వారా నెటిజన్స్ చూపు తిప్పుకోలేక పోతున్నారు.
ఈ ఫోటోలు పెళ్లి అయిన తర్వాత షేర్ చేయడం ద్వారా ఆమె ఏం మెసేజ్ ఇస్తుంది అంటూ కొందరు ప్రశ్నిస్తూ ఉంటే, కొందరు మాత్రం ఆమె తాను గతంలో ఎలా ఉందో ఇప్పుడూ అలాగే ఉన్నాను అని చెప్పడం కోసం ఇలా చేసింది. ముందు ముందు ఆమె నుంచి మరిన్ని మంచి సినిమాలు వస్తాయి అని చెప్పడానికి ఈ ఫోటోలు సింబాలిక్‌గా ఉన్నాయి అంటూ ఆమె ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి నిన్న మొన్నటి వరకు పెళ్లి ఫోటోలతో వైరల్ అయిన అదితి రావు ఇప్పుడు అంతకు మించి అంటూ ఈ బోల్డ్ ఫోటోలతో వైరల్ అవుతోంది. హీరో గారి భార్య బోల్డ్ ఫోటో షూట్ అంటూ ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ షేర్ అవుతున్నాయి.