స్టార్ డైరెక్ట‌ర్ కుమార్తె టాలీవుడ్ డెబ్యూ ఫిక్సైందా!

స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కుమార్తె అతిది శంక‌ర్ హీరోయిన్ గా కోలీవుడ్లో ఎట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే.

Update: 2024-09-09 15:30 GMT

స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కుమార్తె అతిది శంక‌ర్ హీరోయిన్ గా కోలీవుడ్లో ఎట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టీకే హీరోయిన్ గా మూడు సినిమాలు చేసింది. `మావీర‌న్` సినిమాతో అమ్మ‌డికి మంచి గుర్తింపు ద‌క్కింది. అందులో శివ కార్తీకేయ‌న్ కి జోడీగా న‌టించింది. ప్ర‌స్తుతం న‌టిస్తోన్న ఓ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్ష‌న్ లో ఉండ‌గా, మ‌రో సినిమా షూటింగ్ ద‌శ‌లో ఉంది. అలాగే అతిధి డాడ్ సినిమాకి ప్ర‌మోట్ అవున‌ట్లు ప్ర‌చారంలో ఉంది. శంక‌ర్ పిలిచి మ‌రీ కుమార్తెకి అవ‌కాశం ఇస్తున్నాడనే వార్త‌లు కొన్ని రోజులుగా వైర‌ల్ అవుతున్నాయి.

శంక‌ర్ త‌దుప‌రి `వేల‌ప్ప‌న్` న‌వ‌ల ఆధారంగా ఓ సినిమాకి స‌న్నాహాలు చేస్తున్నారు. ఇందులో హీరో ఎవ‌రు? అన్న‌ది ఇంకా ఫైన‌ల్ కాలేదు. కానీ హీరోయిన్ గామాత్రం ఛాన్స్ కుమార్తెకే ఇవ్వాల‌ని ఫిక్స్ అయ్యార‌ని ఆయ‌న స‌న్నిహిత వ‌ర్గాల నుంచి లీకైంది. స‌రిగ్గా ఇదే స‌మ‌యంలో శంక‌ర్ బ్రాండ్ ఇమేజ్ ని ఓ టాలీవుడ్ డైరెక్ట‌ర్ ఇన్ క్యాష్ చేసుకునే దిశ‌గా అడుగులు వేస్తున్న‌ట్టు తెలుస్తోంది. అతిది తెలుగులో ఓ యువ ద‌ర్శ‌కుడు అవ‌కాశం ఇస్తున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

వివ‌రాల్లోకి వెళ్తే... దర్శకుడు విజయ్ కనక‌మేడ‌ల దర్శకత్వంలో త్వ‌ర‌లో ఓ సినిమా ప్రారంభం కానుంది. ఇందులో అతిది శంక‌ర్ హీరోయిన్ గా ఎంపిక చేసిన‌ట్లు వార్త‌లొస్తున్నాయి. ఈ సినిమా షూటింగ్ వచ్చే నెల నుంచి హైదరాబాద్‌లో ప్రారంభం కానుందని స‌మాచారం. అయితే ఇందులో హీరో ఎవ‌రు? అన్న‌ది తెలియ‌దు. అలాగే శంక‌ర్ కుమార్తె తెలుగు చ‌క్క‌గా మాట్లాడుతుంది. తెలుగు అవకాశాల‌కు భాష కూడా క‌లిసొస్తుంది. అయితే ఈ అవ‌కాశంలో నిజ‌మెంతో తెలియాలి.

ఇండియ‌న్ గ్రేట్ డైరెక్ట‌ర్ శంక‌ర్ . పాన్ ఇండియాలోనే కాదు పాన్ వ‌ర‌ల్డ్ లోనే ఆయ‌న‌కు ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ఉంది. కానీ చాలా సింపుల్ ప‌ర్స‌న్. బాలీవుడ్..కోలీవుడ్..టాలీవుడ్ లో ఆయ‌న కోరితే కుమార్తెకి స్టార్ హీరోల స‌ర‌స‌నే అవ‌కాశాలు ఇప్పించ‌గ‌ల‌రు. కానీ ఆ ఛాన్స్ తీసుకోలేదు. ఎవ‌రైనా ప్ర‌తిభ‌తో మాత్ర‌మే రాణించ‌గ‌ల‌ర‌ని న‌మ్మే వ్య‌క్తి. ఇంకా చెప్పాలంటే అతిదికి శంక‌ర్ కేవ‌లం తండ్రి మాత్ర‌మే. అత‌డి ద్వారా అతిది న‌ట‌న‌లో ప్ర‌త్యేక‌గా నేర్చుకున్న‌ది అంటూ ఏం లేదు.

Tags:    

Similar News