మోయ‌లేని దుస్తుల‌తో ఇబ్బంది ప‌డిన హీరోయిన్!

ఇక పాత్ర‌కు త‌గ్గ కాస్ట్యూమ్స్ ఒంటి పై ఉంచుకోవ‌డం మ‌రింత స‌వాల్ గామారింది. అవి ఎంతో బురువైన‌వి. గంట‌ల‌సేపు వాటిని ఒంటిమీద ఉంచుకోవ‌డం చాలా అసౌక‌ర్యంగా అనిపించింది.

Update: 2024-08-06 01:30 GMT

ఇటీవ‌ల రిలీజ్ అయిన సంజ‌య్ లీలా భ‌న్సాలీ విజువ‌ల్ వండ‌ర్ `హీరామండి: ది డైమండ్ బ‌జార్` వెబ్ సిరీస్ తొలి సీజ‌న్ ఎలాంటి విజ‌యం సాధించిదో తెలిసిందే. వెబ్ సిరీస్ లో సైతం సంజ‌య్ మార్క్ క‌ళాత్మ‌క‌త ఒట్టి ప‌డింది. మ‌ల్లికాజాన్ పాత్ర‌లో మ‌నీషా కోయిరాలా..ఫ‌దీదాన్ పాత్ర‌లో సోనాక్షి సిన్హా, వ‌హీదా పాత్ర‌లో సంజీదా షేక్..బిబోజాన్ పాత్ర‌లో అతిది రావు హైద‌రీ అభిన‌యించిన తీరు వావ్ అనిపిస్తుంది.

అద్భుత‌మైన ఆహార్యాల్లో ఎంతో అందంగా హైలైట్ అయ్యారు. ఒక్కో పాత్ర తెరపై ఓ అద్భుతంలా అనిపించింది. అయితే ఇలా ప్రేక్ష‌కుల్ని మెప్పించ‌డం కోసం తామెంత క‌ష్ట‌ప‌డాల్సి వ‌చ్చింద‌ని అతిది రావు హైద‌రీ మాటల్లో అర్ద‌మ‌వుతుంది. బిబోజాన్ పాత్ర ఆహార్యం కోసం పెద్ద సావాస‌మే చేయాల్సి వ‌చ్చింద‌ని తెలిపింది. గంట‌ల కొద్ది మ్యాక‌ప్ ముఖంపై ఉంచుకోవ‌డం ఎంతో ఇబ్బంది గా మారింది.

ఇక పాత్ర‌కు త‌గ్గ కాస్ట్యూమ్స్ ఒంటి పై ఉంచుకోవ‌డం మ‌రింత స‌వాల్ గామారింది. అవి ఎంతో బురువైన‌వి. గంట‌ల‌సేపు వాటిని ఒంటిమీద ఉంచుకోవ‌డం చాలా అసౌక‌ర్యంగా అనిపించింది. కానీ ద‌ర్శ‌కుడి విజ‌న్ కి త‌గ్గ‌ట్టు మేము న‌డుచుకోవాలి. ఆయ‌న‌పై ఉన్న అభిమానం...పాత్ర‌పై ఆస‌క్తితో బ‌రువైన దుస్తుల్ని సైతం ఇష్టంగానే మోసి ప‌నిచేసాను. ఇది నాకొక కొత్త ర‌క‌మైన ఎక్స్ పీరియ‌న్స్ ని అందించింది.

ఇలాంటి పాత్రలు చాలా అరుదుగా వ‌స్తాయి. స‌క్సెస్ అయితే పేరు అలాగే ఉంటుంది. అది స‌క్సెస్ తో సాధ్య‌మైంది. నేను మోసిన ఆ బ‌రువంతా స‌క్సెస్ తో మ‌ర్చిపోయాను` అని తెలిపింది. ఇక ఈ అమ్మ‌డి కెరీర్ ఇప్పుడు పుల్ స్వింగ్ లో ఉన్న సంగ‌తి తెలిసిందే. సినిమాలో పాటు వెబ్ సిరీస్ ల్లోనూ ఛాన్సులం దుకుంటూ బిజీగా ఉంది.

Tags:    

Similar News