హాలీవుడ్ అమ్మాయిలా ఉంది ఈ అందం

అదితి రావ్ హైదరి- సిద్ధార్థ్ జంట అన్యోన్య‌త ఇటీవ‌ల ఎక్కువ‌గా అభిమానుల్లో చ‌ర్చ‌నీయాంశం.

Update: 2024-07-21 05:45 GMT

అదితి రావ్ హైదరి- సిద్ధార్థ్ జంట అన్యోన్య‌త ఇటీవ‌ల ఎక్కువ‌గా అభిమానుల్లో చ‌ర్చ‌నీయాంశం. ప్ర‌స్తుతం ఈ జోడీ ఇటాలియన్ విహారయాత్రలో ఆనందాల‌ను అభిమానుల‌కు షేర్ చేస్తున్నారు. గ‌త కొద్ది రోజులుగా కాబోయే భర్త సిద్ధార్థ్ తీసిన అద్భుతమైన ఫోటోలను అదితీరావ్ అంత‌ర్జాలంలో షేర్ చేస్తున్నారు.

ఇదిగో ఇక్క‌డ షేర్ చేసిన అంద‌మైన ఫోటోగ్రాఫ్ సిధ్ ఫోటోగ్ర‌ఫీ నుంచి దూసుకొచ్చిన మ‌చ్చు తున‌క‌. చూస్తుంటే హాలీవుడ్ వీధుల్లో హాలీవుడ్ అమ్మాయిలా క‌నిపిస్తోంది అదితీ! అంటూ అభిమానులు ప్ర‌శంసిస్తున్నారు. అదితీరావ్ అంద‌చందాల‌కు మంత్ర ముగ్ధులైపోతున్నారు ఫ్యాన్స్. చెక్స్ ష‌ర్ట్.. చినుగుల పొట్టి డెనిమ్స్ ధ‌రించిన అదితీ ఇలా సైకిల్ గాళ్ త‌ర‌హాలో ఫోజులిచ్చింది. నైజాం న‌వాబుల మూలాలున్న అదితీ ఎన్నారైగా సుప‌రిచితురాలు. హైద‌రాబాద్ నుంచి బాంబే క‌నెక్ష‌న్ ఉన్న తార‌గా అదితీరావ్ అత్యున్న‌త స్థాయికి ఎదిగింది. కానీ చివ‌రికి త‌మిళ హీరో సిద్ధార్థ్ తో ల‌వ్ లైఫ్ లో సెటిలైంది. సౌతిండియాలో ప్ర‌తిభావంతురాలైన న‌టిగా రాణిస్తూనే, ప్రేమాయ‌ణంలోను త‌గ్గ‌లేదు ఈ అమ్మ‌డు. ప్ర‌స్తుతం అదితీ ఇట‌లీ టూర్ కి సంబంధించిన ఫోటోగ్రాఫ్స్ ఇంట‌ర్నెట్ ని షేక్ చేస్తున్నాయి.

గురువారం సాయంత్రం అదితి తన సోషల్ మీడియా ఫాలోవర్స్‌కి అద్భుతమైన ఎరుపు రంగు దుస్తులలో ఉన్నప్ప‌టి అంద‌మైన స్టిల్ ని షేర్ చేసింది. దీనిని కాబోయే భర్త, నటుడు సిద్ధార్థ్ క్లిక్ చేసాడ‌ని తెలిపింది. ఇంత‌లోనే ఇప్పుడు సిధ్ ఫోటోగ్ర‌ఫీ నుంచి కొత్త ఫోటోషూట్ ని షేర్ చేసి ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. అదితి రావ్ హైదరి ఇటీవలే ఇటలీలోని టస్కానీలో విహార‌యాత్ర‌కు వెళ్లే ముందు విమానాశ్ర‌యంలో క‌నిపించింది. ప్ర‌స్తుతం సిధ్ తో రొమాన్స్ ని ఎంజాయ్ చేస్తోంది. మార్చి 2024లో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట త్వ‌ర‌లోనే పెళ్లి శుభ‌లేఖ‌ను అంద‌జేయ‌నుంది.

ఇటీవలి టుస్కానీ పర్యటన సాహసం, అన్వేషణతో కూడినది. సుందరమైన టుస్కాన్ వ్యాలీ గుండా సైకిళ్లపై విహ‌రించారు ఈ జంట‌. ఈ ప్రయాణం నుండి అందమైన ఫోటోలతో రీల్‌ను వారు షేర్ చేసారు. ``నేను లా లా లా బైక్ రైడ్ కోసం వెళుతున్నానని అనుకున్నాను... కానీ 10 కి.మీ బైక్ రైడ్ అప్స్ అండ్ డౌన్ లోకి .. అది కూడా కంకర మీద... నా ప్యాంటు పైకి చుట్టి హెల్మెట్ ధ‌రించి సిద్ధూతో నా 10 కి.మీ బైక్ రైడ్‌ని పూర్తి చేసాను. అతడు ఒక చేత్తో కెమెరా తీసుకుని న‌న్ను చిత్రీకరించాడు. ఎందుకంటే నేను కలలు కన్న కొండపై నుండి పడిపోవచ్చని అతడు అనుకున్నాడు!!`` అని క్యాప్ష‌న్ లో రొమాంటిగ్గా రాసింది.

అదితి రావ్ హైదరి - సిద్ధార్థ్ ప్రేమ కథ 2021లో అజయ్ భూపతి దర్శకత్వం వహించిన తెలుగు సినిమా మహా సముద్రం సెట్స్‌లో ప్రారంభమైంది. ఈ చిత్రానికి మోస్తరు ఆదరణ ద‌క్కినా కానీ, సినిమా కంటే సిధ్-అతిథీ ల‌వ్ ఎక్కువ‌గా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. అదితి- సిద్ధార్థ్‌ల నిశ్చితార్థం మార్చిలో జ‌రిగింది. దీనిని ఉమ్మడి ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా అధికారికంగా ప్రకటించారు. ఈ జంట తమ నిశ్చితార్థపు ఉంగరాలను ప్రదర్శిస్తూ ఒక సెల్ఫీని షేర్ చేసారు. అతడు అవును అన్నాడు! E. N. G. A. G. E. D అని అదితీ రాయ‌గా, ``ఆమె అవును అని చెప్పింది! E. N. G. A. G. E. D`` అని సిద్ధార్థ్ అన్నాడు.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే అదితీరావ్ బిజీ బిజీ. సంజయ్ లీలా భ‌న్సాలీ `హీరామండి`లో బిబ్బోజాన్ పాత్రలో అదితీ అద్భుతంగా న‌టించింది. ముఖ్యంగా గజ గామిని నడకకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అదితి రావ్ హైదరి తదుపరి కజ్రీ బబ్బర్ దర్శకత్వంలోని `లయనెస్‌`లో నటిస్తుంది. మార్చి 2024లో నటుడు సిద్ధార్థ్‌తో తన నిశ్చితార్థాన్ని ప్రకటించిన తర్వాత, అభిమానులు వివాహ వార్తల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Tags:    

Similar News