ఆదిత్య 369 రీరిలీజ్.. ఆరేళ్లుగా అనుకుంటున్నారట
ఈ జనరేషన్ ప్రేక్షకులు థియేటర్లలో చూసి ఎక్స్‌పీరియెన్స్ చేయల్సిన కంటెంట్ ఈ మూవీలో చాలానే ఉంది.;

నందమూరి బాలకృష్ణ హీరోగా వచ్చిన ఆదిత్య 369 సినిమాకు ఇప్పటికీ ఎంతో క్రేజ్ ఉంది. టాలీవుడ్ నుంచి వచ్చిన మొదటి సైన్స్ ఫిక్షన్ మూవీ ఇదే. ఏప్రిల్ 4న ఈ సినిమా రీరిలీజ్ కానుంది. 1991లో రిలీజైన ఈ సినిమాను ఆల్రెడీ అందరూ టీవీల్లో చాలా సార్లే చూసి ఉంటారు. కానీ ఇప్పటికీ ఆ సినిమా చూడని ఎంతోమంది ఉన్నారు.
ఈ జనరేషన్ ప్రేక్షకులు థియేటర్లలో చూసి ఎక్స్‌పీరియెన్స్ చేయల్సిన కంటెంట్ ఈ మూవీలో చాలానే ఉంది. ఇదిలా ఉంటే ఈ సినిమాను నేటి జెనరేషన్ కు పరిచయం చేయాలనే ఆలోచనతో పాటూ ఎప్పట్నుంచో అడుగుతున్న బాలకృష్ణ ఫ్యాన్స్ కోరికను మైండ్ లో పెట్టుకుని నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ ఈ రీరిలీజ్‌పై ఆరేళ్ల నుంచి ట్రై చేస్తున్నారట.
కానీ సినిమాకు సంబంధించిన నెగిటివ్ తన వద్ద అందుబాటులో లేకపోవడంతో పాజిటివ్ రీల్స్ కోసమే వెతికారట. అయితే పాజిటివ్ రీల్స్ కూడా చాలా వరకు పాడైపోవడంతో ఏం చేయాలా అని ఆలోచిస్తున్న టైమ్ లో విజయవాడ శాంతి పిక్చర్స్ ఓనర్ వెంకటేశ్వరరావు దగ్గర సినిమాకు సంబంధించిన మంచి ప్రింట్ ఉందని ఫోన్ చేయడంతో ఆ ప్రింట్ ను చెన్నైలోని ప్రసాద్ కార్పొరేషన్ కు ఇచ్చి వెంటనే 4కె కన్వర్షన్ వర్క్స్ ను స్టార్ట్ చేశారట.
అలా మొదలుపెట్టిన 4కె కన్వర్షన్ వర్క్స్ దాదాపు ఆరు నెలల పాటూ టైమ్ తీసుకుందని, ఫైనల్ కాపీ రెడీ అయిన తర్వాత కృష్ణప్రసాద్ వెంటనే బాలయ్యకు ఫోన్ చేయడం, ఇద్దరూ కలిసి చూసుకుని ఈ వెర్షన్ విషయంలో శాటిస్‌ఫై అయ్యాకే రీరిలీజ్ గురించి అనౌన్స్‌చేశామని చెప్పారు. అన్ని సమస్యలను అధిగమించి ఇప్పుడు ఆదిత్య 369, 5.1 సౌండ్ మిక్స్ తో ఏప్రిల్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ రీరిలీజ్ కోసం స్పెషల్ గా ప్రమోషన్స్ కూడా ప్లాన్ చేస్తున్నారని, రీరిలీజ్ కోసం ఓ ఈవెంట్ ను కూడా చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.