అడివి శేష్ కూడా స్పీడ్ పెంచాడు
అయితే 2025 నుంచి సినిమాల విషయంలో అడివి శేష్ మరల స్పీడ్ పెంచుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే అడివి శేష్ ‘గూఢచారి 2’, ‘డెకాయిట్’ సినిమాలు వచ్చే ఏడాది రిలీజ్ కావడం కన్ఫర్మ్ అయిపొయింది.
టాలీవుడ్ లో స్టార్ హీరోల నుంచి ఏడాదికి ఒక సినిమా రావడం కూడా కష్టం అయిపోతుంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ‘ఆచార్య’ మూవీలో కనిపించాడు. మరల లాంగ్ గ్యాప్ తర్వాత ‘గేమ్ చేంజర్’ తో రాబోతున్నాడు. ఎన్టీఆర్ మూడేళ్ళ తర్వాత ‘దేవర’తో మరల ప్రేక్షకుల ముందుకి వస్తున్నాడు. అల్లు అర్జున్ ‘పుష్ప’ మూవీ వచ్చి మూడేళ్లు అయిపోతుంది. టైర్ 2 హీరోలలో కూడా రవితేజ, నాని కాస్తా స్పీడ్ గా ఏడాదికి ఒకటి, రెండు సినిమాలతో వస్తున్నారు.
మిగిలిన హీరోలు ఎవరు కూడా స్పీడ్ గా లేరు. యంగ్ హీరోలలో విశ్వక్ సేన్ క్రమం తప్పకుండా మూవీస్ చేస్తున్నాడు. మిగిలిన యంగ్ హీరోలు సినిమాల పరంగా అంత వేగంగా లేరు. అయితే ఇప్పుడు స్పీడ్ గా సినిమాలు చేస్తోన్న హీరోల జాబితాలోకి అడివి శేష్ వస్తున్నట్లు కనిపిస్తోంది. 2025లో అడివి శేష్ ఏకంగా మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. ఈ విషయాన్ని అడివి శేష్ అధికారికంగా కన్ఫర్మ్ చేశారు.
అడివి శేష్ 2022లో ‘మేజర్’, ‘హిట్ 2’ సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకున్నాడు. ‘మేజర్’ మూవీ అయితే అడివి శేష్ ఇమేజ్ ని పాన్ ఇండియా రేంజ్ కి తీసుకొని వెళ్ళింది. అందుకే అడివి శేష్ నెక్స్ట్ సినిమాలని పాన్ ఇండియా రేంజ్ లోనే ప్లాన్ చేశాడు. అది కూడా భారీ బడ్జెట్ లతో ఈ సినిమాలు తెరకెక్కుతూ ఉండటం విశేషం. ఈ 2023 నుంచి ఇప్పటి వరకు అడివి శేష్ ఒక్క సినిమా కూడా ప్రేక్షకుల ముందుకి తీసుకురాలేదు. గూఢచారి సీక్వెల్ స్క్రిప్ట్ కోసం ఎక్కువ టైం తీసుకున్నారు.
అయితే 2025 నుంచి సినిమాల విషయంలో అడివి శేష్ మరల స్పీడ్ పెంచుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే అడివి శేష్ ‘గూఢచారి 2’, ‘డెకాయిట్’ సినిమాలు వచ్చే ఏడాది రిలీజ్ కావడం కన్ఫర్మ్ అయిపొయింది. ఇవి షూటింగ్ దశలో ఉండగానే మరో సినిమాని కూడా స్టార్ట్ చేసినట్లు ఆయన మాటల బట్టి తెలుస్తోంది. ఈ మూడు సినిమాలు ఒకే ఏడాది రిలీజ్ అయితే అడివి శేష్ అభిమానులకి పండగే అని చెప్పాలి.
2010లోనే ‘కర్మ’ అనే సినిమాతో అడివి శేష్ హీరోగా కెరియర్ స్టార్ట్ చేసిన బ్రేక్ రావడానికి ఆరేళ్ళు పట్టింది. సక్సెస్ వచ్చిన తర్వాత కూడా ఎనిమిదేళ్లలో కేవలం ఆరు సినిమాలు మాత్రమే అడివి శేష్ హీరోగా చేశాడు. ఇవన్నీ కమర్షియల్ హిట్స్ అయ్యాయి. అయితే వచ్చే ఏడాది మాత్రం ఏకంగా 3 సినిమాలతో ప్రేక్షకుల ముందుకి రాబోతుండటం నిజంగా విశేషమని చెప్పాలి. వీటి తర్వాత అతను ఏ విధంగా కెరియర్ జర్నీ కొనసాగిస్తాడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.