ఆ రెండిటితో అడివి శేష్ భారీ టార్గెట్..!

మారిన ఆడియన్స్ టేస్ట్ కి తగినట్టుగానే చేస్తూ కొత్త కథలతో సినిమాలు చేస్తున్నాడు.

Update: 2024-05-07 03:35 GMT

టాలీవుడ్ యువ హీరో అడివి శేష్ సినిమా వస్తుంది అంటే ఆడియన్స్ అంతా కూడా అలర్ట్ అవుతుంటారు. తెలుగు ఆడియన్స్ కు సరికొత్త సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించేందుకు కృషి చేస్తున్న అడివి శేష్ ఆ రేంజ్ రెస్పాన్స్ కూడా అందుకుంటున్నాడు. క్షణం నుంచి హిట్ సెకండ్ కేస్ వరకు అడివి శేష్ చేసిన ప్రతి సినిమా ఎంగేజింగ్ గానే ఉంది. మారిన ఆడియన్స్ టేస్ట్ కి తగినట్టుగానే చేస్తూ కొత్త కథలతో సినిమాలు చేస్తున్నాడు.

ప్రస్తుతం అడివి శేష్ రెండు క్రేజీ ప్రాజెక్టులు చేస్తున్నాడు. అందులో ఒకటి సూపర్ హిట్ సినిమా గూఢచారికి సీక్వెల్ గా వస్తుంటే మరొకటి డెకాయిట్ అంటూ వస్తున్నాడు. గూఢచారి 2 సినిమా పై ఆడియన్స్ భారీ అంచనాలతో ఉన్నారు. వినయ్ కుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాతో మరోసారి తన సత్తా చాటాలని చూస్తున్నాడు అడివి శేష్.

గూఢచారి సినిమా పర్ఫెక్ట్ తెలుగు స్పై థ్రిల్లర్ అని ఆడియన్స్ మెచ్చుకున్నారు. అయితే ఆ సినిమా సీక్వెల్ గా వస్తున్న జి2 అంతకుమించి ఉండేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ సినిమాతో పాటుగా చేస్తున్న డెకాయిట్ కూడా వెరైటీ కథతో వస్తుందని తెలుస్తుంది. ఈ సినిమాను షానీల్ డియో డైరెక్ట్ చేస్తున్నారు. గూఢచారి 2, డెకాయిట్ రెండు సినిమాలతో అడివి శేష్ పెద్ద టార్గెట్ నే పెట్టుకున్నాడని తెలుస్తుంది.

గూఢచారి 2 అనుకున్న విధంగా ఉంటే మాత్రం ఈసారి అడివి శేష్ ని 100 కోట్ల క్లబ్ లో చేర్చడం పక్కా అంటున్నారు. అందుకే సినిమా ఎక్కడ ఆడియన్స్ ఎక్స్ పెక్టేషన్స్ కి తగ్గకూడదని సినిమాను జాగ్రత్తగా చేస్తున్నారు. డెకాయిట్ సినిమా కూడా లవ్ స్టోరీ విత్ రివెంజ్ డ్రామా గా వస్తుంది. ఈ రెండు సినిమాలతో అడివి శేష్ 150 నుంచి 200 కోట్ల మార్కెట్ చేయాలని చూస్తున్నాడు. ఈ రెండు సినిమాలకు బడ్జెట్ కూడా భారీగానే పెట్టేస్తున్నారని తెలుస్తుంది. మరి అడివి శేష్ అనుకున్న టార్గెట్ రీచ్ అవుతాడా లేదా అన్నది చూడాలి. జి2 సినిమా సగానికి పైగా షూటింగ్ పూర్తి కాగా డెకాయిట్ సినిమా శరవేగంగా షూటింగ్ చేస్తున్నారట. సినిమా రిలీజ్ టైం కూడా రిజల్ట్ ని డిసైడ్ చేస్తుంది కాబట్టి ఈ సినిమాల రిలీజ్ ని కూడా పర్ఫెక్ట్ ప్లానింగ్ తో వదలాలని చూస్తున్నారు మేకర్స్.

Tags:    

Similar News