ఎంత పెంచినా కూడా 'అడివి శేష్' వర్త్ వర్మ !
విభిన్న కథలను ఎంపిక చేసుకుంటూ సినిమాలు చేస్తున్న అడివి శేష్ ఏడాది గ్యాప్ తర్వాత ఒకే సారి రెండు సినిమాలను మొదలు పెట్టాడు
విభిన్న కథలను ఎంపిక చేసుకుంటూ సినిమాలు చేస్తున్న అడివి శేష్ ఏడాది గ్యాప్ తర్వాత ఒకే సారి రెండు సినిమాలను మొదలు పెట్టాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ కాస్త అలసి పోయాను అంటూ దాదాపు ఏడాది పాటు పూర్తి విశ్రాంతి లో ఉన్న ఈ యంగ్ హీరో ప్రస్తుతం చేస్తున్న సినిమాలపై ఆసక్తికర ప్రచారం జరుగుతోంది.
అడవి శేష్ గూఢచారి సినిమాతో హిట్ ను సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ అన్నట్లుగా గూఢచారి 2 సినిమాను చేస్తున్నాడు. హిట్ మూవీ సీక్వెల్ అవ్వడంతో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా ఈ సినిమాకు భారీ ఎత్తున బడ్జెట్ ఖర్చు చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి.
మరో వైపు లవ్ కమ్ యాక్షన్ నేపథ్యంలో రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ డెకాయిట్ అనే మూవీని అడివి శేష్ చేస్తున్న విషయం తెల్సిందే. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా బడ్జెట్ కూడా భారీ మొత్తంలో ఉంటుందని సమాచారం అందుతోంది.
అడివి శేష్ గత చిత్రాలతో పోల్చితే గూఢచారి మరియు డెకాయిట్ చిత్రాల బడ్జెట్ లు రెట్టింపు కంటే కూడా అధికం అన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అడివి శేష్ సన్నిహిత వర్గాల వారి నుంచి అందుతున్న ఆఫ్ ది రికార్డ్ సమాచారం ప్రకారం ఈ రెండు సినిమాల బడ్జెట్ దాదాపుగా రూ.150 కోట్లుగా తెలుస్తోంది.
ఒకప్పుడు పాతిక కోట్లు అంతకు లోపు బడ్జెట్ తో సినిమాలు చేసిన అడివి శేష్ ఇప్పుడు తన సినిమాల బడ్జెట్ ను ఒక్కసారిగా పెంచేశాడు. బ్లాక్ బస్టర్ విజయాలను సొంతం చేసుకుంటే తప్ప బ్రేక్ ఈవెన్ సాధ్యం అవ్వదు. పాన్ ఇండియా రేంజ్ లో అడివి శేష్ కి ఉన్న క్రేజ్ నేపథ్యంలో భారీ బడ్జెట్ ని పెట్టేందుకు నిర్మాతలు ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ రెండు హిట్ అయితే శేష్ క్రేజ్ మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. దాంతో ఆయన సినిమాల బడ్జెట్ మరింత పెరిగినా ఆశ్చర్యం లేదు.