వయసు తగ్గిస్తున్న తలైవా.. ఎందుకంటే..
లోకేష్ కనగరాజ్ ప్రస్తుతం సౌత్ లో స్టార్ డైరెక్టర్ గా తనదైన బ్రాండ్ ఇమేజ్ తో దూసుకుపోతున్నాడు.
లోకేష్ కనగరాజ్ ప్రస్తుతం సౌత్ లో స్టార్ డైరెక్టర్ గా తనదైన బ్రాండ్ ఇమేజ్ తో దూసుకుపోతున్నాడు. మాఫియా బ్యాక్ డ్రాప్ కథలని సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరిస్తున్నారు. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేసి అందులో కథలని తెరకెక్కిస్తూ వస్తున్నారు. ఒక కథతో మరో కథకి ఎక్కడో ఒక చోట లీడ్ ఉండేలా చేస్తున్నాడు. అందుకే అతని సినిమాల పట్ల ఆడియన్స్ లో ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంది.
లియో సినిమా కంటెంట్ పరంగా అంతగా మెప్పించకపోయిన కూడా కమర్షియల్ గా సక్సెస్ అయ్యింది. అయితే నెక్స్ట్ సినిమాల విషయంలో పొరపాట్లు చేయకుండా ఉండటానికి లియో లోకేష్ కి ఒక ఎగ్జాంపుల్ గా ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ సూపర్ స్టార్ రజినీకాంత్ తో సినిమా చేయడానికి సిద్ధం అవుతున్నాడు. రజినికాంత్ 171 వ చిత్రంగా ఈ మూవీ తెరకెక్కనుంది.
ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్ ప్రస్తుతం జరుగుతోంది. మాఫియా బ్యాక్ డ్రాప్ కథతో లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లోనే ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ మూవీ గురించి ఇంటరెస్టింగ్ న్యూస్ ఒకటి బయటకొచ్చింది. ఈ సినిమాలో సూపర్ స్టార్ రజినీకాంత్ 25 ఏళ్ళ యువకుడిగా కనిపిస్తాడట. దానికోసం డీఏజినింగ్ టెక్నాలజీని లోకేష్ వాడబోతున్నట్లు ప్రచారం నడుస్తోంది.
డీఏజినింగ్ టెక్నాలజీ టెక్నాలజీని ఆచార్య సినిమాలో ఫ్లాష్ బ్యాక్ లో మెగాస్టార్ చిరంజీవిని యంగ్ లుక్ లో చూపించడానికి ఉపయోగించారు. అయితే ఆ లుక్ ఆడియన్స్ కి అంతగా నచ్చలేదు. విడుదలై 2 చిత్రంలో విజయ్ సేతుపతిని యంగ్ లుక్ లో చూపించడానికి ఉపయోగించారు. అలాగే ఇండియన్ 2లో కమల్ హాసన్ పాత్ర కోసం కూడా ఈ డీఏజినింగ్ టెక్నాలజీని శంకర్ ఉపయోగించారు.
GOAT సినిమాలో విజయ్ ని యంగ్ గా చూపించడం కోసం వెంకట్ ప్రభు ఈ టెక్నాలజీ వాడారు. ఇప్పుడు లోకేష్ కనగరాజ్ కూడా సూపర్ స్టార్ రజినీకాంత్ ని 25 ఏళ్ళ యువకుడిగా చూపించడం కోసం ఈ డీఏజినింగ్ టెక్నాలజీని వాడబోతున్నట్లు తెలుస్తోంది. ఈ టెక్నాలజీ వాడుతున్న సినిమాలన్నీ రిలీజ్ కి సిద్ధం అవుతున్నాయి. అవి సక్సెస్ అయితే లోకేష్, రజినీకాంత్ మూవీకి కలిసొచ్చే ఛాన్స్ ఉంది. ఏప్రిల్ లో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలవ్వబోతున్నట్లు తెలుస్తోంది.