ఆహా లో .. నెవ్వర్ బిఫోర్ మూవీ?

ఇలా అడల్ట్ కంటెంట్ తో వచ్చి సెన్సార్ బోర్డు బ్యాన్ చేసిన సినిమాలు తెలుగులో చాలా అరుదు అని చూపొచ్చు.

Update: 2024-08-14 16:15 GMT

తెలుగులో సినిమాలు బ్యాన్ కావడం చాలా రేర్ గా జరుగుతూ ఉంటుంది. సినిమాలో ఎంతో వివాదాస్పదమైన ఎలిమెంట్స్ ఉంటేనే తప్ప వాటిని సెన్సార్ బోర్డు బ్యాన్ చేయదు. అలాగే శృతి మించిన అడల్ట్ కంటెంట్ ఉంటే థియేటర్స్ లో రిలీజ్ కి అనుమతి ఇవ్వరు. ఇలా అడల్ట్ కంటెంట్ తో వచ్చి సెన్సార్ బోర్డు బ్యాన్ చేసిన సినిమాలు తెలుగులో చాలా అరుదు అని చూపొచ్చు.

మొదటి సారి “EVOL” అనే చిత్రాన్ని థియేటర్స్ లో రిలీజ్ చేయడానికి సెన్సార్ బోర్డు అనుమతి ఇవ్వలేదు. ఓ విధంగా బ్యాన్ చేసిందని చెప్పాలి. రామ్ వెలగపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కంటెంట్ ఫుల్ బోల్డ్ అండ్ అడల్ట్ గా ఉందని సెన్సార్ బోర్డు తిరస్కరించింది. ఇలాంటి సినిమాలని థియేటర్స్ లో రిలీజ్ చేయడానికి అనుమతి ఇవ్వలేమని చేతులెత్తేసింది.

అయితే ఇప్పుడు ఈ చిత్రాన్ని డైరెక్ట్ ఆహా ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నారు. తాజాగా మూవీ ట్రైలర్ ని కూడా ఆహా యుట్యూబ్ ఛానల్ లో రిలీజ్ చేశారు. ఆగష్టు 15న ఈ సినిమా ఓటీటీ ఆడియన్స్ ముందుకి రాబోతున్నట్లు ట్రైలర్ లో కన్ఫర్మ్ చేశారు. ఈ మూవీ ట్రైలర్ చూస్తుంటే ఇది ఒక అమ్మాయి ఇద్దరు అబ్బాయిల మధ్య జరిగిన వివాహేతర సంబంధం నేపథ్యంలో కథ ఉన్నట్లు తెలుస్తోంది.

భార్య, భర్తల మధ్యలోకి మూడో వ్యక్తి వస్తాడు. భర్త ఉండగానే హీరోయిన్ మరొక మగాడితో శృంగార వాంఛలు తీర్చుకుంటుంది. దానికి భర్త కూడా అడ్డుచెప్పడు. అడల్ట్ కంటెంట్ తో స్టార్ట్ అయిన ట్రైలర్ ఇద్దరు మగాళ్ల హత్యలతో ఎండ్ అయినట్లు చూపించారు. ఈ ట్రైలర్ చూస్తుంటే మూవీ ఎంత బోల్డ్ గా తీశారో అర్ధం అవుతోంది. అయితే ఇలాంటి అడల్ట్ క్రైమ్ జోనర్ సినిమాలు, వెబ్ సిరీస్ లని హిందీలో ఏక్తా కపూర్ నిర్మిస్తూ ఉంటుంది.

అలాగే ఆల్ట్ బాలాజీ ఓటీటీలో రిలీజ్ అవుతాయి. ఇంత వైల్డ్ గా పెద్దలు కూడా చూడలేని సినిమాని రెగ్యులర్ ఎంటర్టైన్మెంట్ మూవీస్, వెబ్ సిరీస్ చేసే ఆహాలో ఎందుకు రిలీజ్ చేస్తున్నారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ మూవీ టైటిల్ చూస్తుంటే ఎవరికి అర్ధం కావడం లేదు. Love ని రివర్స్ లో చేసి ఈ సినిమాకి టైటిల్ గా పెట్టారు. దీనిని బట్టి లవ్ ని వేరొక కోణంలో ఈ చిత్రంలో చూపించబోతున్నారని అర్ధమవుతోంది.

Tags:    

Similar News