స్టార్ కిడ్‌ని నిలబెట్టడం కోసం సీక్వెల్స్, రీమేక్స్
బాలీవుడ్‌లో ఒకప్పుడు స్టార్ కిడ్స్‌కి మంచి ఆధరన ఉండేది. హీరోలుగా ఎంట్రీ ఇచ్చిన చాలా మంది స్టార్ కిడ్స్ సూపర్ హిట్స్‌ను సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.;

బాలీవుడ్‌లో ఒకప్పుడు స్టార్ కిడ్స్‌కి మంచి ఆధరన ఉండేది. హీరోలుగా ఎంట్రీ ఇచ్చిన చాలా మంది స్టార్ కిడ్స్ సూపర్ హిట్స్‌ను సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. అంతే కాకుండా స్టార్‌డం దక్కించుకుని స్టార్ హీరోలుగా నిలిచిన సందర్భాలు ఉన్నాయి. కానీ గత దశాబ్ద కాలంగా స్టార్ కిడ్స్ హీరోలుగా హిట్ కొట్టడం కష్టంగా మారింది. ఈమధ్య కాలంలో ఎంతో మంది స్టార్ హీరోల వారసులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. కానీ వారిలో కొద్ది మంది మాత్రం పర్వాలేదు, ముందు ముందు అయినా సక్సెస్ అవుతారు అనిపించుకున్నారు. కానీ ఎక్కువ శాతం మంది మాత్రం ఇండస్ట్రీకి వీళ్లు పనికి రారు అనే విమర్శలను ఎదుర్కొన్నారు. హీరోగా సక్సెస్ కాలేక పోతున్న వారు చాలా మంది ఉన్నారు.
బాలీవుడ్ స్టార్ నటుడు సునీల్ శెట్టి తన వారసులను ఇండస్ట్రీలో పరిచయం చేశాడు. మొదట బిడ్డను హీరోయిన్‌గా పరిచయం చేశాడు. కానీ ఆమె ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. ఇంకాస్త గట్టిగా కష్టపడితే ఆఫర్లు వచ్చేవి, హిట్ దక్కేదేమో కానీ ఆమె నటనకు గుడ్ బై చెప్పి క్రికెటర్ కేఎల్ రాహుల్‌ను పెళ్లి చేసుకుని వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది. ప్రస్తుతం సునీల్ శెట్టి తనయుడు అహన్ శెట్టి హీరోగా కిందా మీద పడి గుర్తింపు తెచ్చుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. మన తెలుగు సినిమా ఆర్‌ఎక్స్ 100 ను హిందీలో రీమేక్ చేసి అహన్ శెట్టిని ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశ పరచడంతో అహన్ శెట్టి హిట్ కోసం వెయిట్ చేయాల్సిన పరిస్థితి.
మొదటి సినిమా నిరాశ పరచడంతో దాదాపు ఐదేళ్లు గ్యాప్ తీసుకుని అహన్ నటిస్తున్న సినిమా 'బోర్డర్ 2'. 1997లో సన్నీ డియోల్, సునీల్ శెట్టి, జాకీ ష్రాఫ్, అక్షయ్ ఖన్నా వంటి స్టార్స్ నటించిన 'బోర్డర్' సినిమాకు సీక్వెల్‌గా 'బోర్డర్ 2' సినిమా రూపొందుతోంది. సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్‌గా రూపొందుతున్న సినిమా కావడంతో 'బోర్డర్ 2' పై ఆసక్తి ఉంది. అహన్ శెట్టి 'బోర్డర్ 2' కోసం చాలా కష్టపడుతున్నాడని, ఈసారి కచ్చితంగా హిట్ కొట్టే అవకాశాలు ఉన్నాయని బాలీవుడ్‌లో కొందరు మాట్లాడుకుంటున్నారు. సునీల్ శెట్టికి బోర్డర్ సూపర్ హిట్‌గా నిలిచిన కారణంగా అహన్‌కు బోర్డర్ 2 సెంటిమెంట్‌గా కలిసి వచ్చి సూపర్ హిట్‌గా నిలిచే అవకాశాలు ఉన్నాయి.
బోర్డర్ సీక్వెల్‌తో పాటు ఒక కన్నడ సూపర్ హిట్ మూవీని రీమేక్ చేసేందుకు గాను అహన్ రెడీ అవుతున్నాడు. సునీల్ శెట్టి విజ్ఞప్తి మేరకు ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ కన్నడ మూవీ కిర్రాక్ పార్టీ రీమేక్ హక్కులను కొనుగోలు చేసినట్లు సమాచారం అందుతోంది. రక్షిత్ శెట్టి, రష్మిక మందన్న నటించిన కిర్రాక్ పార్టీ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. రక్షిత్, రష్మికలకు స్టార్‌డం తెచ్చి పెట్టిన సినిమాగా నిలిచింది. అందుకే కిర్రాక్ పార్టీ సినిమాను తెలుగులో నిఖిల్ హీరోగా రీమేక్ చేశారు. తెలుగులో పర్వాలేదు అన్నట్లుగా నిలిచింది. ఇప్పుడు హిందీలో అహన్ శెట్టి హీరోగా రీమేక్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఈ స్టార్ కిడ్‌కి హిట్ ఇవ్వడం కోసం ఒకేసారి సూపర్ హిట్ సినిమా సీక్వెల్ చేయడంతో పాటు, సూపర్ హిట్ మూవీ రీమేక్‌ను చేస్తున్నారు. ఈ రెండింటితో అయినా అహన్ శెట్టి సక్సెస్‌ను దక్కించుకుంటాడేమో చూడాలి. బాలీవుడ్ స్టార్ కిడ్స్‌లో చాలా మంది ఈమధ్య కాలంలో వచ్చిన ప్రతి సినిమాతో బొక్క బోర్లా పడుతున్నారు. ఇటీవల బోనీ కపూర్ వారసుడు అర్జున్ కపూర్ నటించిన సినిమా వచ్చి బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. కనుక అహన్ ఖాన్ మంచి కంటెంట్‌తో వస్తే తప్ప అంత ఈజీగా హిట్ దక్కదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.