ఈమె ఏమైనా పాప్ స్టార్ అనుకుంటోందా?
ఎంపిక చేసుకున్న టాప్ బటన్ లెస్ గా మతులు చెడగొడుతోంది. ముడి వేసిన బ్లాక్ జర్కిన్ లో ఇన్నర్ వేర్ అందాలు మతులు చెడగొడుతున్నాయి.
ఐషా శర్మ పరిచయం అవసరం లేదు. ఈ బ్యూటీ నిరంతర ఫోటోషూట్లు సోషల్ మీడియాల్లో వేడెక్కిస్తూనే ఉన్నాయి. నేహా శర్మ- ఐషా శర్మ (శర్మా సిస్టర్స్) జంట ఫోటోషూట్లకు కొదవేమీ లేదు. ఇటీవలే ఐషా షేర్ చేసిన స్పెషల్ షూట్లు ఇంటర్నెట్ ని షేక్ చేసాయి.
ప్రస్తుతం ప్రపంచ పాప్ దిగ్గజం డ్యుయా లిపా ముంబై పర్యటనలో ర్యాంప్ ని హోరెత్తిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వేదిక వద్ద భారీగా బాలీవుడ్ సెలబ్రిటీలు సందడి చేసారు. అందులో శర్మాగాళ్ ఐషా శర్మ కూడా ఉన్నారు. ఐషా స్టన్నింగ్ బ్లాక్ లుక్ లో పాప్ స్టార్ వైబ్స్ ని క్రియేట్ చేసారు అక్కడ. ఐషా పూర్తిగా వెస్ట్రన్ స్టైల్ డిజైనర్ దుస్తుల్లో కనిపించింది.
ఎంపిక చేసుకున్న టాప్ బటన్ లెస్ గా మతులు చెడగొడుతోంది. ముడి వేసిన బ్లాక్ జర్కిన్ లో ఇన్నర్ వేర్ అందాలు మతులు చెడగొడుతున్నాయి. అలా లిఫ్ట్ లో వెళుతూ ఆదమరిచి సెల్ఫీలు తీసుకుంటున్న శర్మా గాళ్ కొత్త లుక్ ఇంటర్నెట్ ని షేక్ చేస్తోంది. శర్మాగాళ్ ఎంతగా ప్రయత్నిస్తున్నా కెరీర్ పరంగా బెటర్ మెంట్ కనిపించడం లేదు. కానీ సోషల్ మీడియాల్లో నిరంతరం అభిమానులను యంగేజ్ చేస్తూ ఫాలోవర్స్ ని పెంచుకుంటోంది ఈ బ్యూటీ. శర్మా సిస్టర్స్ ప్రకటనల ఆదాయం చెప్పుకోదగ్గ రేంజులో ఉంది. ఇక ఐషా సోదరి నేహా శర్మ అడపాదడపా సినిమాల్లో నటిస్తూ నిరంతరం మీడియాకు టచ్ లో ఉంది. ఐషా ప్రస్తుతం సౌత్ లో ఒక్క ఛాన్స్ కోసం ప్రయత్నిస్తోందట. ఇక్కడ తొలి అవకాశం ఎవరు ఇస్తారో వేచి చూడాలి.