చరణ్ రావడమే బిగ్ థింగ్..!
ఇక సినిమాలో హీరోయిన్ గా నటించిన ఐశ్వర్య లక్ష్మి తన షార్ట్ అండ్ స్వీట్ స్పీచ్ తో ఆకట్టుకుంది.
సాయి దుర్గ తేజ్, ఐశ్వర్య లక్ష్మి లీడ్ రోల్ లో రోహిత్ కెపి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా సంబరాల ఏటిగట్టు. ఈ సినిమాను ప్రైం షో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు. సినిమా ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేయగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్లోబల్ స్టార్ రాం చరణ్ వచ్చారు. చరణ్ ఎమోషనల్ అండ్ ఎనర్జిటిక్ స్పీచ్ తో ఆడిటోరియం అదిరిపోయింది.
ఇక ఆ తర్వాత ఫ్యాన్స్ ని తప్పనిసరిగా హెల్మెట్ ధరించి బయటకు వెళ్లండని తేజ్ కూడా స్పీచ్ తో ఆకట్టుకున్నాడు. ఇక సినిమాలో హీరోయిన్ గా నటించిన ఐశ్వర్య లక్ష్మి తన షార్ట్ అండ్ స్వీట్ స్పీచ్ తో ఆకట్టుకుంది. ఎలా ఉన్నారు బాగున్నారా అంటూ మైక్ అందుకున్న వెంటనే ఫ్యాన్స్ ని ఉద్దేశించి మాట్లాడిన అమ్మడు. చరణ్ గారిని చూసి మీరు హ్యాపీగా ఫీల్ అయ్యారా అన్నారు. ఇది రోహిత్ డెబ్యూ మూవీ.. ప్లీజ్ మా కోసం మీరు ప్రే చేయండి.. మీ అందరి ఆశీస్సులు కావాలి త్వరలోనే థియేటర్ లో కలుద్దాం అని స్పీచ్ ముగించారు ఐశ్వర్య లక్ష్మి.
ఇక ఇదే క్రమంలో ఇంత భారీ బడ్జెట్ సినిమా తీస్తూ జస్ట్ అర నిమిషంలో తన స్పీచ్ ముగించాడు దర్శకుడు రోహిత్. మైక్ అందుకున్న ఆయన ఇక్కడకి వచ్చినందుకు అందరికీ థాంక్స్. చరణ్ గారికి థాంక్స్. ఫస్ట్ సినిమాకు మీరు రావడం బిగ్ థింగ్. నిర్మాత నిరంజన్ రెడ్డి గారికి థాంక్స్.. మీరు నా మీద నమ్మకం ఉంచారు. సాయి తేజ్ సర్ కి థాంక్ యు అని స్పీచ్ ముగించాడు దర్శకుడు రోహిత్.
సాయి తేజ్ 10 ఏళ్ల కెరీర్ పూర్తైన సందర్భంగా ఈవెంట్ కి తేజ్ తో పనిచేసిన దర్శకులు ఈ ఈవెంట్ కు వచ్చారు. తేజ్ తో మొదటి సినిమా చేసిన వైవిఎస్ చౌదరి నుంచి మారుతి, అనీల్ రావిపుడి ఇలా తేజ్ తో సక్సెస్ అందుకున్న దర్శకులంతా ఈవెంట్ లో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు. సంబరాల ఏటిగట్టు విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. తేజ్ కెరీర్ లో హైయెస్ట్ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులను ఏమేరకు మెప్పిస్తుందో చూడాలి. ఫస్ట్ లుక్ టీజర్ అయితే అంచనాలను పెంచేసింది.