ఐశ్వర్య బాడీగార్డు జీతం తెలిస్తే మతిపోవడం ఖాయం
బయటికెళ్తే ఎవరికైనా ఖర్చులు సహజమే కానీ సెలబ్రిటీలు బయటికెళ్లాలంటే వారి వెంట ఉండే సెక్యురిటీ కోసం వాళ్లు చాలా భారీ మొత్తంలో ఖర్చు చేయాల్సి ఉంటుంది.;

సెలబ్రిటీల ఆదాయం ఎంత ఉంటుందో దానికి తగ్గట్టే ఖర్చులు కూడా ఉంటాయి. ప్రతీ దానికీ భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. బట్టలు, మేకప్, స్టైలిస్టుల కోసం మాత్రమే కాకుండా వారు ఎక్కడికైనా వెళ్లాలన్నా ఎంతో ఖర్చవుతుంటుంది. బయటికెళ్తే ఎవరికైనా ఖర్చులు సహజమే కానీ సెలబ్రిటీలు బయటికెళ్లాలంటే వారి వెంట ఉండే సెక్యురిటీ కోసం వాళ్లు చాలా భారీ మొత్తంలో ఖర్చు చేయాల్సి ఉంటుంది.
సెలబ్రిటీకి క్రేజ్ ఎంత ఎక్కువ ఉంటే బయటకు వెళ్లేటప్పుడు అంత టైట్ సెక్యూరిటీ అవసరమవుతుంది. ఫలితంగా దాని కోసం ఎక్కువగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. కేవలం సెలబ్రిటీల వరకు మాత్రమే కాకుండా వారి ఫ్యామిలీకు కూడా రక్షణ, భద్రత అవసరం. దీని కోసం సెలబ్రిటీలు ఒక్కో బాడీగార్డుకు లక్షల్లో జీతాన్ని సమర్పిస్తుంటారు.
ప్రపంచవ్యాప్తంగా భారీ క్రేజ్ సంపాదించుకున్న ఐశ్వర్యా రాయ్ కు బయటకెళ్తే ఎంతో భద్రత అవసరం. ఆమె భద్రత కోసం పలువురు బాడీ గార్డ్స్ పనిచేస్తుంటారు. అందులో శివరాజ్ ఒకరు. శివరాజ్ గత కొన్నేళ్లుగా ఐశ్వర్యకు బాడీ గార్డుగా ఉంటున్నారు. ఐశ్వర్య కాలు బయటపెడితే ఆమెతో పాటూ శివరాజ్ కూడా తప్పకుండా ఉంటూ ఆమెకు రక్షణ కల్పిస్తూ ఉంటాడు.
ఐశ్వర్యకు శివ రాజ్ బాడీగార్డు మాత్రమే కాదు, బచ్చన్ ఫ్యామిలీకి ఆత్మీయుడు కూడా. శివ రాజ్ పక్కన ఉంటే ఐశ్వర్య ఎంతో సేఫ్టీగా ఫీలవుతుందట. అందుకే అతనికి నెలకు ఏకంగా రూ.7 లక్షలు జీతం ఇస్తుందట ఐశ్వర్య. అంటే సంవత్సరానికి రూ.84 లక్షలు. మల్టీ నేషనల్ కంపెనీల్లో ఉండే సీనియర్ మోస్ట్ ఎంప్లాయిస్ కు కూడా ఈ రేంజ్ జీతముండదేమో. శివ రాజ్ తో పాటూ రాజేంద్ర ధోలే అనే బాడీ గార్డు కూడా ఐశ్వర్య దగ్గర పని చేస్తాడు. అతనికి ఏకంగా సంవత్సరానికి కోటి రూపాయలు జీతంగా ఇస్తారట ఐశ్వర్య. జీతం ఎక్కువ అని ఆశ్చర్యపోయినప్పటికీ వారి పని అంత సులభమేమీ కాదు. సదరు సెలబ్రిటీలు బయటికెళ్లినప్పుడు వారిని కంటికి రెప్పలా కాపాడటంతో పాటూ కొన్ని క్లిష్ట పరిస్థితుల్లో ప్యాన్స్ అభిమానానికి భంగం కలగకుండా ఆమెను రక్షించడమంటే మాటలు కాదు. ఇన్ని బాధ్యతలున్నప్పుడు వారు తీసుకునే జీతం అంత ఎక్కువేమీ కాదనిపిస్తుంది.