ఎన్ని పుకార్లు ఉన్నా సెట్స్‌లో తన పనిలో ఐష్
ఐశ్వర్యరాయ్- అభిషేక్ బచ్చన్ జంట విడాకుల గురించి మీడియాలో చాలా రోజులుగా కథనాలొస్తున్నాయి. దీనిని ఇరువర్గాలు ధృవీకరించలేదు. పైగా అభిషేక్, అమితాబ్ ఈ వార్తలను ప్రచురించిన మీడియాలపై తమ అసహనం వ్యక్తం చేసారు.
ఐశ్వర్యరాయ్- అభిషేక్ బచ్చన్ జంట విడాకుల గురించి మీడియాలో చాలా రోజులుగా కథనాలొస్తున్నాయి. దీనిని ఇరువర్గాలు ధృవీకరించలేదు. పైగా అభిషేక్, అమితాబ్ ఈ వార్తలను ప్రచురించిన మీడియాలపై తమ అసహనం వ్యక్తం చేసారు. వ్యాపారం కోసం వార్తలు రాస్తున్నారని నర్మగర్భంగా అమితాబ్ విమర్శించారు.
ఇదిలా ఉంటే.. ఐశ్వర్యారాయ్ ఇన్ని పుకార్ల నడుమ కూడా తన వృత్తిగత బాధ్యతను విడిచిపెట్టలేదు. వృత్తిపరమైన కమిట్మెంట్లను నెరవేర్చడంలో బిజీగా ఉన్నారు. ఇటీవల దుబాయ్‌లో జరిగిన గ్లోబల్ ఉమెన్స్ ఫోరమ్ ఈవెంట్‌కు హాజరైన ఐష్ ఈవెంట్ తర్వాత ముంబైకి తిరిగి వచ్చారు. అనంతరం షూటింగు కోసం వచ్చారు. అక్కడ సెట్ నుండి ఓ ఫోటోని మేకప్ ఆర్టిస్ట్ అడ్రియన్ జాకబ్స్ షేర్ చేసారు. ఐష్ ఈ ఫోటోలో మునుపటిలా ఎంతో అందంగా ఉందని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఐష్ తన మేకప్ ఆర్టిస్ట్‌తో ఫోటోకు పోజులిచ్చేప్పుడు సరదాగా చిరునవ్వులు చిందిస్తున్నారు. ఆమె నల్లటి పిన్‌స్ట్రైప్ జాకెట్‌లో కనిపించింది.
ఈ ఫోటోగ్రాఫ్ రెడ్డిట్ సహా సోషల్ మీడియాల్లో వైరల్ గా మారుతోంది. దీనికి అభిమానుల నుంచి స్పందనలు అనూహ్యంగా ఉన్నాయి. ఐశ్వర్య రాయ్ -అభిషేక్ జంటపై ఎన్ని పుకార్లు వస్తున్నా కానీ వాటిని ఎవరూ అధికారికంగా ధృవీకరించడం లేదు. ఈ సంవత్సరం ప్రారంభంలో అనంత్ అంబానీ - రాధిక మర్చంట్ వివాహంలో ఇద్దరూ వేర్వేరుగా కనిపించిన తర్వాత విడాకుల వార్తలు మరింత ఊపందుకున్నాయి. ఆరాధ్య పుట్టినరోజు వేడుకల్లో బచ్చన్ కుటుంబీకులు లేకపోవడం కూడా ఈ ప్రచారానికి సాయమైంది.
కెరీర్ మ్యాటర్ కి వస్తే... ఐశ్వర్య రాయ్ బచ్చన్ చివరిగా మణిరత్నం చారిత్రక డ్రామా `పొన్నియిన్ సెల్వన్ 2`లో కనిపించింది. తదుపరి వరుస చిత్రాల్లో నటించేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తోంది.