ఫిర్యాదు చేసినా ప‌ట్టించుకోని క‌మిటీలు దండ‌గ‌: ఐశ్వ‌ర్య రాజేష్

హేమ కమిటీ నివేదిక మలయాళ సినీప‌రిశ్ర‌మ‌ను కుదిపేస్తోంది. ఇతర పరిశ్రమలలో కూడా దీని ప్రభావం కనిపిస్తోంది.

Update: 2024-09-28 14:44 GMT

హేమ కమిటీ నివేదిక మలయాళ సినీప‌రిశ్ర‌మ‌ను కుదిపేస్తోంది. ఇతర పరిశ్రమలలో కూడా దీని ప్రభావం కనిపిస్తోంది. తమిళనాడులో నటి రాధిక శరత్‌కుమార్ ఈ విషయం గురించి చాలా బాహాటంగా మాట్లాడటంతో చాలామంది బిడియం విడిచి త‌మ స‌మ‌స్య‌ల‌ను బ‌హిర్గ‌తం చేస్తున్నారు. తమిళ సినీ పరిశ్రమలోని తన సహోద్యోగులు, మేల్ సభ్యులు సహా ఇటువంటి సమస్యలను బహిరంగంగా చర్చించాలని డిమాండ్ చేశారు.

ఇదిలా ఉండగా నడిగర్ సంఘం (తమిళనాడు నటీనటుల సంఘం) తమిళ సినీరంగంలో లైంగిక వేధింపుల సమస్యలను పరిష్కరించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి నటి రోహిణి అధ్యక్షత వహిస్తారు. ఫిర్యాదులను సైబర్ పోలీసులతో షేర్ చేస్తామ‌ని, లైంగిక వేధింపులకు పాల్పడిన ఎవరైనా తమిళ చిత్ర పరిశ్రమ నుండి ఐదేళ్లపాటు నిషేధించబడతారని పేర్కొన్న‌ట్టు తెలిసింది.

సెట్స్‌లో లాజిస్టికల్ అవసరాలపై ఐశ్వర్య

ప్ర‌తిభావంతురాలైన యువ‌న‌టి ఐశ్వర్య రాజేష్ ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ.. చిత్ర పరిశ్రమలో 12 సంవత్సరాలుగా ఉన్నానని, మహిళా నటిగా నేను ఔట్‌డోర్ షూట్‌లకు వెళ్లినప్పుడు సరైన టాయిలెట్‌ల సౌకర్యం కల్పించడం అనేది పరిష్కరించాల్సిన మొదటి సమస్య అని అన్నారు. ఒక క‌థానాయిక‌గా నేను అన్ని సౌకర్యాలతో కూడిన వ్యానిటీ వ్యాన్‌ని ఇస్తారు.. కానీ సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్టులుగా పని చేసే ఇతర మహిళల గురించి ఏమిటి? సౌకర్యాలు లేనందున వారు ఇబ్బంది ప‌డుతున్నారు. ఒక మహిళగా సుదీర్ఘమైన అవుట్‌డోర్ షూట్‌లో ఉన్నప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. సినిమా పరిశ్రమ కూడా ఇలాంటి ముఖ్యమైన సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను.. అని తెలిపారు.

తమిళ సినీ ప‌రిశ్ర‌మ‌లో లైంగిక వేధింపుల కేసులను పరిష్కరించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయడాన్ని ఐశ్వ‌ర్య స్వాగతించారు.. ``నేను చిత్ర పరిశ్రమలో అలాంటి సమస్యలను ఎదుర్కోలేదు.. ఇలాంటి సంఘటనలు జరగకూడదని ఆశిస్తున్నాను. నేను ఎదుర్కోలేదు కాబట్టి అది జరగదని కాదు. సహాయం కోసం లేదా తీర్మానం కోసం క‌మిటీ వద్దకు వెళ్లే మహిళలకు ప‌రిష్కారం లభించకపోతే అది ఏర్పాటు చేయడంలో అర్థం లేదు. వారికి అవసరమైన సహాయాన్ని అందించడంలో సీరియ‌స్‌గా ఉండటం ముఖ్యం. మహిళలు ఫిర్యాదు చేసినందుకు ఉద్యోగావకాశాలు లేదా ఉపాధిని కోల్పోకూడదు. వారిని రక్షించాలి.. ఎవరైనా దోషులుగా తేలితే, వారు శిక్షను అనుభవించాలి! అని అన్నారు.

ఐశ్వర్య రాజేష్ తమిళం, తెలుగు, మలయాళం, హిందీ సినీ ప‌రిశ్ర‌మ‌ల్లో పనిచేశారు. ఏ న‌టి అయినా నిజాయితీగా బలంగా నమ్మకంగా ఉండాలి. మిమ్మల్ని బుల్‌డోజ్ చేయడానికి మీరు ఎవరినీ అనుమతించకూడ‌దు. ఎవరైనా అడ్వాన్స్‌డ్ అయితే మీరు వారికి ముఖం మీద చెప్పాలి - కాదు అంటే కాదు. మ‌హిళ‌లు ధైర్యంగా మాట్లాడాలి. నేను అలాంటిదానినే. నా స్నేహితులకు కూడా నేను ఇచ్చే సలహా ఇదే! అని అన్నారు.

Tags:    

Similar News