ఛాన్సులివ్వ‌ర‌ని పెళ్లి ని వాయిదా వేస్తోన్న బ్యూటీ!?

బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ఇలా అన్ని భాష‌ల్లోనూ మూడు ముళ్లు వేయించుకున్న భామ‌ల‌దే అగ్రస్థానం

Update: 2025-01-05 18:30 GMT

ప్ర‌స్తుతం ఇండ‌స్ట్రీలో పెళ్లైన భామ‌ల‌కున్న గిరాకీ గురించి తెలిసిందే. పెళ్లి, ప్ర‌స‌వంతో సంబంధం లేకుండా హీరోయిన్లు అవ‌కాశాలు అందుకుంటున్నారు. ఇంకా చెప్పాలంటే పెళ్లైనే భామ‌ల‌కు ఇచ్చిన ప్రాధాన్య‌త పెళ్లికాని భామ‌ల‌కు ఇవ్వ‌డం లేదు. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ఇలా అన్ని భాష‌ల్లోనూ మూడు ముళ్లు వేయించుకున్న భామ‌ల‌దే అగ్రస్థానం. అయితే ఐశ్వ‌ర్యా రాజేష్ మాత్రం పెళ్లి చేసుకుంటే సినిమా అవ‌కాశాలు రావు అనే వాద‌న తీసుకొచ్చింది.

ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న అమ్మ‌డిని పెళ్లి చేసుకోవ‌చ్చు క‌దా? అని ప్ర‌శ్నిస్తే! పెళ్లి చేసుకోక‌పోతే నాలుగు సినిమా అవ‌కాశాలు వ‌స్తాయి అంటుంది ఐశ్వ‌ర్య‌. దీనికి యాంక‌ర్ నాలుగు కాదు న‌ల‌భై చేయ్. పెళ్లి చేసుకుని సినిమాలు చేయ్ అంది. సినిమాల్లోకి వ‌చ్చిన భ‌ర్త పంపిచ‌క‌పోతే ఎలా అంటే నువ్వు ఇల్లు చూసుకో..నేను సంపాదిస్తాన‌ని చెప్పు అంటుంది. అయితే అలాంటి పిల్ల‌గాడు దొరికితే త‌ప్ప‌కుండా చేసుకుంటాన‌ని ఐశ్వ‌ర్య బ‌ధులిస్తుంది.

తెలుగు పిల్ల‌గాడైనా ప‌ర్వాలేదు..త‌మిళ పిల్ల‌గాడైనా ప‌ర్వాలే! మంచి పిల్ల‌గాడు మాత్ర‌మే కావాలంది. ప్ర‌స్తుతం ఐశ్వ‌ర్యా రాజేష్ `సంక్రాంతికి వ‌స్తున్నాం` సినిమాలో వెంక‌టేష్ కి భార్య పాత్ర‌లో న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఆమె కెరీర్ లో ఇదే పెద్ద అవ‌కాశం. గ‌తంలోనూ కొన్ని తెలుగు సినిమాలు చేసింది. కానీ అగ్ర హీరోతో క‌లిసి ప‌నిచేసే అవ‌కాశం రావ‌డం ఇదే తొలిసారి. ఈసినిమాపై అమ్మ‌డు చాలా ఆశ‌లు పెట్టుకుంది.

సినిమాపై అంచ‌నాలు బాగానే ఉన్నాయి. అయితే ఐశ్వ‌ర్యా రాజేష్ తెలుగు న‌టి అయినా త‌మిళ‌నాడులో స్థిర‌ప‌డింది. కెరీర్ లో ఎక్కువగా కోలీవుడ్ సినిమాలే చేసింది .అక్క‌డ అమెకు మంచి ఫాలోయింగ్ ఉంది. మ‌రి సంక్రాంతి రిలీజ్ త‌ర్వాత ఎలా ఫామ్ లోకి వ‌స్తుందో చూడాలి.

Tags:    

Similar News