లాల్ సలామ్.. ఐశ్వర్య ఆలోచన ఇదేనేమో!

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్.. లీడ్ రోల్ లో యాక్ట్ చేసిన లాల్ సలామ్ మూవీ కొద్ది రోజుల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

Update: 2024-09-16 21:30 GMT

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్.. లీడ్ రోల్ లో యాక్ట్ చేసిన లాల్ సలామ్ మూవీ కొద్ది రోజుల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వం వహించిన ఆ సినిమాలో విష్ణు విశాల్, విక్రాంత్ కూడా ముఖ్య పాత్రలు పోషించారు. తలైవా నటించడంతో భారీ అంచనాల మధ్య ఫిబ్రవరి 9వతేదీన థియేటర్లలో విడుదలైంది. కానీ అనుకున్న స్థాయిలో మెప్పించలేకపోయింది. ఊహించని విధంగా డిజాస్టర్ టాక్ అందుకుంది.

అయితే ఆ సినిమా థియేటర్లలో విడుదలై ఏడు నెలలు అయినా ఇప్పటికీ ఓటీటీలోకి రాలేదు. ఇక స్ట్రీమింగ్ అవ్వదేమోనని చాలా మంది ఫిక్స్ అయిపోయారు. ఇంతలో ఐశ్వర్య రజినీకాంత్.. ఓ ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు. త్వరలో ఓటీటీలోకి సినిమా రానుందని తెలిపారు. షూటింగ్ కు సంబంధించిన ఓ హార్డ్ డిస్క్ పోయిందని.. ఆ సీన్స్ ఉంటే మరో రేంజ్ లో సినిమా వచ్చేదని అప్పుడు చెప్పిన ఐశ్వర్య.. ఇప్పుడు ఆ డిస్క్ దొరికిందని చెప్పారు.

థియేట్రికల్ కంటే ఓటీటీ వెర్షన్ భిన్నంగా ఉంటుందని వెల్లడించారు. దొరికిన హార్డ్ డిస్క్ లోని కొన్ని సీన్స్ ను యాడ్ చేస్తున్నట్లు చెప్పారు. స్క్రిప్ట్ ప్రకారం.. ఇప్పుడు మార్చుతున్నట్లు తెలిపారు. ఎక్స్ ట్రా యాడ్ చేసిన సీన్స్ కు ఏఆర్ రెహామాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. అందుకు ఆయనేం పారితోషికం తీసుకోవడం లేదని క్లారిటీ ఇచ్చారు. అంటే ప్రస్తుతం లాల్ సలామ్ మూవీకి మార్పులు, చేర్పులు చేస్తున్నారన్నమాట.

ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారగా.. ఒక్కొక్కరు ఒక్కోలా రెస్పాండ్ అవుతున్నారు. ఇప్పుడు రిపేర్ చేసి మరీ సినిమాను స్ట్రీమింగ్ చేయడం అవసరమా అని క్వశ్చన్ చేస్తున్నారు. చేస్తుంది రీషూట్ కాదు కాబట్టి.. థియేటర్ లో చూడని సీన్స్ మాత్రమే ఓటీటీ వెర్షన్ లో ఉంటాయని చెబుతున్నారు. అసలు ఇప్పుడు ఓటీటీ రిలీజ్ చేయడమెందుకు అని కొందరు అడుగుతున్నారు. దానికి తోడు వెట్టియాన్ రిలీజ్ ముందు ఈ వ్యవహారమెందుకని అంటున్నారు.

అదే సమయంలో లాల్ సలామ్ ఓటీటీ రిలీజ్ డేట్ ఇంకా ఐశ్వర్య ప్రకటించలేదు. దానికి తోడు.. థియేట్రికల్ రన్ లో రెస్పాన్స్ ఎలా ఉన్నా.. కొన్ని సినిమాలు ఓటీటీలో మంచి స్పందనను అందుకుంటున్నాయి. బహుశా ఐశ్వర్య ఆలోచన ఇదేనేమో. పైగా రెండు వెర్షన్ల మధ్య కచ్చితంగా తేడా ఉంటుందని చెబుతున్నారు. మరి నెట్ ఫ్లిక్స్ లోకి లాల్ సలామ్ ఎప్పుడు వస్తుందో.. ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో వేచి చూడాలి.

Tags:    

Similar News