దేవుని సొంత దేశంలో పుట్టి ఏమి ఈ అరాచకం?
థై స్లిట్ బ్లాక్ డిజైనర్ గౌన్ ఈ భామ లోని హాట్ కంటెంట్ ని పదింతలు పెంచిందంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు.
ఐశ్వర్య లక్ష్మి పరిచయం అవసరం లేదు. మణిరత్నం 'పొన్నియన్ సెల్వన్' సహా దుల్కార్ 'కింగ్ ఆఫ్ కోథ' వంటి భారీ పాన్ ఇండియా చిత్రాల్లో ఈ బ్యూటీ నటించింది. ఐశ్వర్య అందం, అద్భుత నట ప్రదర్శనకు ఇప్పుడు తమిళనాడు, తెలుగు రాష్ట్రాల్లో భారీ ఫాలోవర్స్ ఉన్నారు. పెరిగిన క్రేజ్ కి తగ్గట్టే ఐశ్వర్య పలు భారీ సినిమాలకు సంతకాలు చేసిందని సమాచారం.
ఇటీవలే లెజెండరీ మణిరత్నం తెరకెక్కించిన 'పొన్నియిన్ సెల్వన్ -1' వార్షికోత్సవం సందర్భంగా (30సెప్టెంబర్ 2022న విడుదలైన PS-1) బోట్ గర్ల్ పూంగుజలి పాత్రను పోషించిన నటి ఐశ్వర్య లక్ష్మి ఇన్ స్టాలో ఒక త్రోబాక్ ఫోటోని షేర్ చేసింది. ది మణి సర్ స్క్వాడ్ పేరుతో రిలీజ్ చేసిన ఈ ఫోటోలో పీఎస్ 1 స్టార్లు అంతా ఉన్నారు. పొన్నియిన్ సెల్వన్ 1 దాదాపు 500కోట్లు వసూలు చేయగా సీక్వెల్ పొన్నియిన్ సెల్వన్ 2 ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 350 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. సుమారు 850కోట్లు వసూలు చేసిన ఫ్రాంఛైజీలో ఐశ్వర్య లక్ష్మి కథానాయిక.
అటుపై 'కింగ్ ఆఫ్ కోథ' ఆశించిన రిజల్ట్ ని ఇవ్వకపోవడం ఈ భామను నిరాశపరిచింది. అయినా ఐశ్వర్యకు అవకాశాల పరమైన సమస్య లేదు. అటు తమిళం ఇటు తెలుగు రెండుచోట్లా అవకాశాలు వరిస్తున్నాయని సమాచారం. ఇంతలోనే ఐశ్వర్యలక్ష్మి లేటెస్ట్ ఫోటోషూట్ అంతర్జాలంలో వైరల్ గా మారింది. ఇది యువతరం గుండెల్లో గుబులు రేపుతోంది.
ఐశ్వర్య లక్ష్మి పూర్తిగా లెదర్ డ్రెస్ లో సంథింగ్ హాట్ గా కనిపిస్తోంది. థై స్లిట్ బ్లాక్ డిజైనర్ గౌన్ ఈ భామ లోని హాట్ కంటెంట్ ని పదింతలు పెంచిందంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ఐషు పేరుతో ఉన్న ఇన్ స్టా పేజీలో ఐశ్వర్య లక్ష్మి స్వయంగా ఈ ఫోటోషూట్ ని షేర్ చేసింది. ఇది వెబ్ లో వేగంగా వైరల్ అవుతోంది.
స్వగతం:
ఐశ్వర్య లక్ష్మి మలయాళ నటి. మలయాళం- తమిళం-తెలుగు పరిశ్రమలకు సుపరిచితం. 2017లో మలయాళ చిత్రం జందుకళుడే నత్తిల్ ఒరిడవేలాతో తొలిసారిగా నటించింది. మాయానది (2017), వరతన్ (2018), విజయ్ సూపరం పౌర్ణమియం (2019), అర్జెంటీనా ఫ్యాన్స్ కట్టూర్‌కడవు (2019)లో కనిపించింది. లక్ష్మి యాక్షన్ (2019)తో తమిళంలో అరంగేట్రం చేసింది. కెరీర్ లో ఒక ఫిలింఫేర్ సౌత్ అవార్డు, మూడు SIIMA అవార్డులను గెలుచుకుంది.
ఈ మల్లూ భామ దేవుని సొంత దేశం- కేరళలోని త్రివేండ్రంలో 6 సెప్టెంబర్ 1991న జన్మించింది. లక్ష్మి తన పాఠశాల విద్యను హోలీ ఏంజెల్స్ కాన్వెంట్ త్రివేండ్రంలో - త్రిస్సూర్‌లోని సేక్రేడ్ హార్ట్ కాన్వెంట్ గర్ల్స్ హయ్యర్ సెకండరీ స్కూల్‌లో చేసింది. 2017లో ఎర్నాకులంలోని శ్రీ నారాయణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (SNIMS) నుండి MBBS డిగ్రీని పూర్తి చేసింది. అక్కడ తన ఇంటర్న్‌షిప్‌ను కూడా పూర్తి చేసింది. త్రివేండ్రం - కొచ్చిన్‌లలో తన కుటుంబీకులతో నివసిస్తుంది.