మంగ‌ళ‌వారం2లో జాన‌ర్ ఏంటంటే..

ఆర్ఎక్స్100 సినిమాతో ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టి మొద‌టి సినిమాతోనే బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్నాడు డైరెక్ట‌ర్ అజ‌య్ భూప‌తి.;

Update: 2025-04-07 06:30 GMT
Mangalavaram 2 A Prequel with Horror and Devotional Twist!

ఆర్ఎక్స్100 సినిమాతో ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టి మొద‌టి సినిమాతోనే బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్నాడు డైరెక్ట‌ర్ అజ‌య్ భూప‌తి. ఆ సినిమాతో డైరెక్ట‌ర్ గా అజ‌య్ భూప‌తి త‌న‌కంటూ ప్ర‌త్యేక‌త‌ను సంపాదించుకున్నాడు. ఆర్ఎక్స్మ‌100 త‌ర్వాత చేసిన హాసముద్రం సినిమా భారీ అంచ‌నాల‌తో వ‌చ్చి నిరాశ ప‌రిచిన‌ప్ప‌టికీ ఆ త‌ర్వాత మ‌రోసారి త‌న మొద‌టి హీరోయిన్ పాయ‌ల్ తో చేసిన మంగ‌ళ‌వారం సినిమాతో మ‌ళ్లీ హిట్ అందుకున్నాడు.

మంగ‌ళ‌వారం సినిమా క‌మ‌ర్షియ‌ల్ గా సూప‌ర్ హిట్ అయింద‌ని చెప్ప‌లేం కానీ నిర్మాత‌లను లాభాల్లోకి మాత్రం తెచ్చింది. డైరెక్ట‌ర్ గా అజ‌య్ భూప‌తికి, హీరోయిన్ గా పాయ‌ల్ కు కూడా మంగ‌ళ‌వారం సినిమా మంచి పేరును తెచ్చిపెట్టింది. ఈ సినిమాకు సీక్వెల్ గా మంగ‌ళ‌వారం2 ఉంటుంద‌ని ఆ సినిమా టైమ్ లోనే డైరెక్ట‌ర్ చెప్పిన విష‌యం తెలిసిందే.

దీంతో మంగ‌ళ‌వారం2 టాలీవుడ్ లోని మోస్ట్ అవెయిటింగ్ సీక్వెల్స్ లిస్ట్ లో చేరింది. అయితే మంగ‌ళ‌వారం సినిమాకు సీక్వెల్ చేయ‌డానికి కుద‌ర‌దు అందుకే ఆ సినిమాకు ప్రీక్వెల్ చేస్తున్నారు. ఆల్రెడీ క‌థ అక్క‌డితో ఎండ్ అయింది కాబ‌ట్టి దానికి ప్రీక్వెల్ అయితే క‌థ చెప్ప‌డానికి కూడా బావుంటుంద‌ని అజ‌య్ భూప‌తి భావిస్తున్నాడు.

ఆల్రెడీ అజ‌య్ భూప‌తి మంగ‌ళ‌వారం2కు సంబంధించిన స్క్రిప్ట్ వ‌ర్క్ పూర్తి చేశాడ‌ని, త్వ‌ర‌లోనే షూటింగ్ ను కూడా మొద‌లుపెట్ట‌నున్నాడ‌ని తెలుస్తోంది. ఈ ప్రీక్వెల్ పై మంచి బ‌జ్ ఉన్న కార‌ణంగా బాలీవుడ్ లోని ఓ పెద్ద నిర్మాణ సంస్థ కూడా ఇందులో భాగం కానుంద‌ని టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాపై ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం అవుతుంది.

మంగ‌ళ‌వారం సినిమా సైక‌లాజిక‌ల్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ గా రూపొందిన విష‌యం తెలిసిందే. దీంతో మంగ‌ళ‌వారం2 కూడా అదే జాన‌ర్ లో ఉంటుంద‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ మంగ‌ళ‌వారం2 సినిమాలో హార్ర‌ర్ ఎలిమెంట్స్ తో పాటూ సినిమాకు డివోష‌న‌ల్ ట‌చ్ ఇవ్వ‌నున్నాడ‌ట డైరెక్ట‌ర్ అజ‌య్ భూప‌తి. త్వ‌ర‌లోనే చిత్ర యూనిట్ నుంచి మంగ‌ళ‌వారం2కు సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న రానుంది.

Tags:    

Similar News